5, నవంబర్ 2014, బుధవారం

నువ్వు నేను...!!

ఎదురెదురుగా నువ్వు నేను
మాటలే మూగబోయిన క్షణాలు
పలకరింపులు అక్కరకు రాలేదు
నా మనసు మౌనాన్ని వీడినా
నీకందని ప్రేమ లేఖల భాష్యాలు
నే చదవలేని నీ మది తలపుల
భావాలు పలికించే కనుల కావ్యాలు
ఏనాటికి తెలిసేను మనసులకు
ఈ ప్రణయ ప్రబంధ పరిచయం
జతగ చేరని చెలిమి ఆరాటం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner