3, నవంబర్ 2014, సోమవారం

ఏమిటో ఈ జీవితాలు...!!

నేస్తం...
           ఎందుకో కాస్త బాధగా ఉంది.... రోజు చూస్తున్న మనుష్యులే అయినా, ఆ మనస్తత్వాలే అయినా.. ఎంతగా అలవాటు పడిపోయినా ఏదో ఒక క్షణం ఈ బాధను పంచుకొనక తప్పడం లేదు... తెల్ల కాగితానికి చిన్న నల్ల చుక్కను పెట్టి ఇదేమిటి అని అడిగిన చక్రం సినిమాలో సంఘటన నన్ను వెన్నాడుతూనే ఉంది... ఎందుకిలా మనం ఎదుటివారిలో తప్పునే ఎక్కువగా చూస్తున్నాము... కాస్తయినా మంచిని చూడలేక పోతున్నాము... మన మనసులు ఇంత సంకుచితంగా మిగిలిపోతున్నాయి... ఎందరిలో ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అనుకుంటే ఎలా సరిపోతుంది... మనం చేసే పని వల్ల కాని, మన వ్యక్తిత్వం వల్ల కాని, మన హావభావాల ప్రకటన వలన కాని, మన నడవడిక వలన కాని మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది.. అంతే కాని మన దగ్గర ఉన్న దనం వలన కాని, అలంకరణ, వేష భాషల వలన వచ్చే గౌరవం తాత్కాలికమే అవుతుంది... అందరి మనస్సులో శాశ్వతంగా మిగిలిపోయేది మన మంచి మనసు వలనో లేదా మనం చేసే మంచి పనుల వల్లనో నలుగురిలో గుర్తుగా ఉండిపోతే అది ఎప్పటికి అలానే నిలిచిపోతుంది... పెద్ద తెల్లకాగితాన్ని చూడలేని మనం దానిలోని చిన్న మచ్చను మాత్రం తేలికగా గుర్తు పట్టగలం... ఇది మన నైజాన్ని చూపిస్తుంది.... ఎదుటివారిలో మంచిని చూడలేని మనకు మనలో మంచిని మాత్రం తెలుసుకునే అవకాశం ఎలా వస్తుంది....?? ఓ చిన్న మెచ్చుకోలు ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలదో ఒకసారి మనం చూడగలిగితే ఆ సంతోషం మనకు తెలుస్తుంది... కాకపొతే మనకు ఎప్పుడు చెడు చూడటమే ఆనవాయితీగా మారిపోయి మంచిని చూడలేక పోతున్నాము.... ఏమిటో ఈ జీవితాలు... ఈ ఉరుకులు పరుగులు...!! ఓ క్షణం పలకరించే తీరుబడి లేని ప్రయాణంగా పరుగెత్తుతూనే ఉన్నాము.... మరి ఎన్ని రోజులో ఇలా...!!
నా భావాలు పంచుకునే ప్రియ నేస్తానివి నువ్వున్నావనే ఇలా నీకు అప్పుడప్పుడు చెప్పడం..... ఉండనా నేస్తం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner