12, నవంబర్ 2014, బుధవారం

వసి వాడని....!!

కదిలే కాలం వదలిన జ్ఞాపకాల ఆనవాళ్ళు
మదిలో దాగిన మౌన వీచికలు
వద్దంటున్నా వదలిపోని స్మృతి కలశాలు
మరపులేని మధురాక్షరాలు
రాలిపడిన పొగడపూల సుగంధాలు
చిన్ననాటి తీపి గురుతులు
కప్పిన మంచుపూల పరదాలు తీసిన
వేకువ పిలిచిన పిలుపులు
దాచుకున్న అక్షరాల దాగని భావనల రూపాల
అమరికలో తొంగి చూస్తున్న గేయాలు
వెన్నెల దొంతరల్లో దోబూచులాడుతూ తిమిరపు
చుట్టాన్ని సాగనంపిన తారకలు
జ్ఞాపకాల సంతకాల సంతసాలు విలసిల్లే గతాన్ని
వసి వాడని వన మయూరంలా ఆస్వాదించు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner