1, డిసెంబర్ 2014, సోమవారం

ఏకమైన తరుణాలు ....!!


దివి నుంచి భువికి అరుదెంచిన
అపురూప అందాల రమణీ లలామా
దేవదారు వెన్నెల జలపాతమా
నీ సొగసులకు దాసోహమే చెలి
అసమాన సౌందర్య వన్నెల వలపుల రాణి
నీ మేని కాంతులకు తారలన్ని చిన్నబోయే
ముడుచుకున్న చందురుని ముద్దుల మోము
ముడుపులుగా మారి నీ పాదాక్రాంతమయ్యె
అక్కున జేరవే అపరంజి కొమ్మా అలుకలు మాని
నీ అచ్చట ముచ్చట అందిన అదియె చాలు
వేల జన్మల జతలు ఏకమైన తరుణాలు ....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner