3, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు...!!

02/12/14
1. తారలన్ని నేలరాలాయి_నీ నవ్వుల నక్షత్రాల ధాటికి తాళలేక
2, రాగం తీసే కోయిల మౌనమయ్యింది ఎందుకో_తన గళాన్ని నీకిచ్చేసినందుకేమో
3. గమకాల  లెక్కలు తప్పాయి_నీ గమ్యాన్ని చేరుకోలేక\
4.  ఎద మౌనమయినా_మానసం నీ పేరే జపిస్తోంది
5.  మౌన రాగాల సరాగాలతో ముగ్ధమైన మది_మనసు గీతాలు ఆలపిస్తోంది
6. జ్ఞాపకాల పొందిక_అమర్చావు అందమైన మాలికగా
7. నీ వియోగాన్ని తాళలేక _గమ్యాన్నే విస్మరించా
8. ఊపిరినే వద్దంది_ నీ తలపుల తాకిడికి తట్టుకొనలేక
9. శరాల విరులు సంధించావుగా_ఇక అస్త్ర విన్యాసం చూడాలి
10. మువ్వలా ముడుచుకుంది_ నీ ముగ్ధ మోహన సౌందర్యానికి
11.నీ నవ్వు కోసం ఎదురు చూస్తున్నా_ముత్యాల సరంలో కొడవడిన ముద్ద మందారాల కోసం
12. ముసి ముసిగా నవ్వుతున్నాయి ముత్యాలు _నీ ముంగిట చేరాయని గర్వంగా
13. అతిశయాల ఆణిముత్యం చిన్నబోయింది_నీ చిరు నగవుల కాంతికి వడలి
14. అవని సోయగాల ముంగిట_మగువ ముగ్ధరాలే ఎప్పుడు
15. సిగ్గుల మొగ్గ ఈ ముదిత_ధరణి అందాలకు పులకరిస్తూ
16. చేరువనే తారాడుతున్నా_నా మేని మెరుపులు గుర్తెరగలేదా
17. లాలిత్యం లలితంగా చెప్పింది _సిగ్గుల మొగ్గలు నీ బుగ్గల్లో పూచాయని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner