10, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు.....!!

09/12/14
1. నీ కన్నీటిలో కనుమరుగై పోతానేమో_కాస్త దాచుకోవు జ్ఞాపకంగా
2. నీ ప్రేమకు వేళయిందో ఏమో_సందె పొద్దు సల్లంగా జారుకుంటోంది
3. పేదా గొప్పా తేడా నాకెందుకు_పలకరిస్తే ప్రతి మోమునా విరుస్తూనే ఉంటానుగా
4. పిలిస్తే వచ్చేస్తానుగా_ఓ సారి పిలవరాదూ
5. నాకోసం కూడా మౌన వ్రతాలెందుకు_ఓ సారి నవ్వేయరాదూ
6. మదిలో వింటేనే ఇంత అలజడా_చెంతకు వస్తే ఏమిటో మరి
7. నాది నీది ఒకటే అనుకున్నా_నన్ను మరచి నీతో ఉండి పోయా
6. జతగా వెన్నెలమ్మ వస్తుందిగా_ సందె పొద్దు ఎందుకు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner