4, డిసెంబర్ 2014, గురువారం

వెన్నెలమ్మ ఒడిలో....!!


రేయమ్మ పిలిచింది నిదురమ్మను రమ్మని
వలపు జతగా చేరింది కలల కబురమ్మకు
మనసు పయనించింది నీ ఊహల చెంతకు
జాబిలమ్మ తోడయ్యంది వెన్నెల వాకిట
చందనాల జల్లు కురిసింది నా మది ముంగిట
నీ జ్ఞాపకాల అలల తాకిడి తాకింది నా ఎదను
ముసిరిన చీకట్లను కసిరే కాంతిలా
వేకువ వెన్నెలను పిలిచే తనువులా
రెప్పవేయని ఇలానే రెప్పచాటు స్వప్నమా
వెన్నెలమ్మ ఒడిలో నీ చేరువగా ఉండనీ....!!



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner