17, డిసెంబర్ 2014, బుధవారం

పసి మనసున దైవత్వం ...!!


ముద్దుగారే మోమున వెలిగే
మురిపాల నవ్వుల పువ్వులు
తారల తళుకులు చిన్నబోయే
నీ కన్నుల కాంతుల ముందు
పాలుగారేటి పసిడి అందాలు
పలికించు మౌనాల ముచ్చట్లు
మరపించు అమ్మను చిరు స్పర్శతో
చూపించు ముల్లోకపు మోహాలు
అందించు ఆనందాల ఐశ్వర్యాలు
మరుజన్మకు మణి మాణిక్యాలుగా
కోపాలు రోషాలు కడతేర్చు
కలికి చిలుకల ఈ కసికందు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner