31, డిసెంబర్ 2014, బుధవారం

మాయమైన ఘడియలు....!!

నేస్తం....
          మన స్నేహంలో మనం పంచుకున్న ఎన్నో అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, కష్టాలు... ఇలా చెప్పుకుంటూ పొతే కోకొల్లలు.... ఎందుకో తెలియదు కాని జరిగిపోయిన గతంలో కొన్ని గురుతులు మాసిపోకుండా కాలం ఎంత వేగంగా పయనించినా అవి కూడా మనతో పాటే మనల్ని అంటి పెట్టుకునే ఉంటున్నాయి... వదిలేద్దామన్నా వదలని ఈ జ్ఞాపకాలను ఏం చేయాలో తెలియడం లేదు...జీవితంలో కొన్ని ఘడియలు చెరిగిపొయినా చెక్కు చెదరనివి ఈ జ్ఞాపకాలు... గతం చేదుగా ఉన్నా తియ్యగా ఉన్నా జ్ఞాపకం ఎప్పుడు బావుంటుంది కదూ... మనం ఉన్నా లేక పోయినా మన జ్ఞాపకాలు జీవిస్తూనే ఉంటాయి... మాయమైన ఘడియలు మళ్ళి రాకుండానే కొన్ని జీవితాలు తెల్లారిపోతూ ఉంటాయి... ఆ కొన్ని జీవితాల్లో నేను ఉన్నానని సంతోషమో, బాధో తెలియదు కాని ఎందుకో ఓ చిన్న ఓదార్పు నాకు... ఓ పక్క నమ్మకం మోసపోయిన క్షణం మళ్ళి వస్తుందేమో అని భయం కూడానూ... ఆ క్షణాలను పదే పదే తట్టుకోవాలంటే మనసుకి అంత శక్తి లేదేమో అని ఆలోచన... అన్ని చూసిన జీవితానికి క్షణాల లెక్కలను కూడా దాచేసిన వాస్తవంతో పాటు గతాన్ని కూడా మాయం చేస్తే ఎంత బావుండేది... కొన్ని వత్సరాలు తలచుకోవడానికి ఇష్ట పడక పోయినా మరి కొన్ని మనల్ని వదలనంటూ వెన్నాడుతూనే ఉంటాయి కాలంతో పాటు... భావాలను దాయలేని మనసు ఇలా అక్షరాలను ఆశ్రయిస్తూ ఊరట చెందుతూ మరో వత్సరానికి స్వాగతం పలికేస్తూ..... ఉండనా మరి ఈ సంవత్సరానికి ఈ కబుర్లతో సరిపెడుతూ....
నీ నెచ్చెలి..

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner