6, డిసెంబర్ 2014, శనివారం

ఏక్ తారలు ...!!

05/12/14
1. లాలి పాటల జోల విననే లేదు_అమ్మ గోరుముద్దల తీయదనం తెలియక
2. మరుపన్నది తెలుసా_మదిలోని ప్రేమకు ఎదను తాకిన మమతకు
3. జావళిలా సాగే జన పదాలే_మనసుని మురిపించే ముచ్చటలు
4. వేసారిన గుండెల్లో_నీ పలుకులు మలయ సమీరాలై తాకుతూ... 
5. చెక్కిలిపై జారిన చుక్క అడిగింది_నీ రూపాన్నెందుకు తడిపేస్తున్నావని
6. వేడిమి తాపానికి_వర్షించే నీ ప్రేమ వర్షం ఓ హర్షమే
7. రేయికెంత సంబరమో_నీ ఊసుల జతలో చేరడానికి
8. చిరు జల్లుల ముంగిట్లో తడుస్తూ_నువ్వు నేను
9. రెప్ప చాటు స్వప్నాలు_అందమైన స్వాగతాలుగా నీ కోసం
10. అసహజత్వానికి దగ్గరగా_వెలిసి రంగుల వర్ణాలు
11. పరిమళాలన్ని పానుపుగా పరిచా_పువ్వులన్ని అలిగితే
12. చూపుల చురుకు తగిలి_మనసు దాచేస్తే ఎలా
13. మనసు మౌనంగా దాగుంది_చూపుల వా(వే )డి తట్టుకోలేకేమో
14. నీ చూపుల చల్లదనానికి_వెన్నెల వాకిలి ముద్దయ్యింది చూడలేదూ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner