2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు...!!

28/11/14
1. దాయలేని కన్నీటి కావ్యాలు_రాస్తున్న ఈ అక్షర కవనాలు నీకోసమే....
2. రాతిరి వెన్నెల దుప్పటి పరిచా_కలల హర్మ్యాలు నీతో కలసి విహరిద్దామని
3. మనసు మౌనాలు నీ ముందు పరిచా_పెదవి పలుకులు నీకు వినిపించాలని
4. అక్షరాలని ఆదమరిచా_నీ జ్ఞాపకాల సంకెళ్ళని తెలియక
5. పెదవి విరుపున దాగుంది_నీ నవ్వో అది లేక నా వెన్నెల జడివానో
6. శేషాన్ని మరచిన సాయంత్రాలు_దిగులు ముంగిట్లో దోబూచులాడుతూ....
7. జ్ఞాపకాల పుటల్లో_నల్లనయ్య సరసన నెమలిఈకలా
8. పరవశాల పానుపులన్ని నీకేగా_పదిలంగా అందుకోరాదు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner