8, డిసెంబర్ 2014, సోమవారం

వలపులమ్మా...!!

రేయిని దాచెను వెన్నెలమ్మా 
నింగిని కప్పెను మబ్బులమ్మా
నీ కోసం ఎదురు చూసేను కూనలమ్మా

తారల చెంతను చేరెను జాబిలమ్మా
రెప్పల మాటున నిదురమ్మా
నీ ఊహల ఒదిగెను జాణకొమ్మా

కలలను కలిసెను కునుకమ్మా
కడలిని అడిగెను కోరికమ్మా
నీ చెంతను చోటిమ్మని చెలియమ్మా

మనసు అందం దాచెనమ్మా
మౌనరాగం పాడెనమ్మా
నీ పిలుపుల కమ్మదనం దొరికెనమ్మా

వెన్నెల ఆటలు చాలునమ్మా
వన్నెల కొమ్మల వీచికలమ్మా
నీ అందెల  సవ్వడి నా కందెనమ్మా

మోహపు పరదాలు ఎందుకమ్మా 
జ్ఞాపకాల అలజడులు చాలునమ్మా
నీతో చేరిన నా మది సంగతి చూడవమ్మా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner