19, డిసెంబర్ 2014, శుక్రవారం

జీవిత పయనం...!!లతల అందాల కోమలత్వం
లతాంగి మదిలో సున్నితత్వం
లలిత లావణ్యాల ముగ్ధత్వం
లక్షణమైన సొగసుల లాలిత్యం
లగ్నంలో దొరికిన ఆణి ముత్యం
లక్షల వరాల జన్మ బంధం
లలాట లిఖితానికి విధాత లేపనం
లయకారుని విలయ తాండవం
లలనామణి లేని జీవిత పయనం...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner