5, డిసెంబర్ 2014, శుక్రవారం

ఏక్ తారలు ...!!

04/12/14
1. చిలుకమ్మ అలుక పూనింది_తమ ముక్కు ఎర్రదనం నీ బుగ్గల్లో చేరిందని
2. ఏకాంతమేలా_నా జ్ఞాపకాల తోడును నీకందించానుగా
3. కోపమెందుకో మొహం చాటేసింది_నీ నవ్వుల చల్లదనానికి తట్టుకోలేకేమో
4. నవరసాలు నా చుట్టాలేగా_సాధారణ మనిషినైనందుకు
5. నీ కోసం వెతికే ఆ కళ్ళలో కనిపించేది నీ రూపమే_అవి వర్షించే ప్రేమామృతాన్ని తిలకించు
6. కాగితాలు తడచినా_అందమైన భావాలుగా అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి
7. గాయాల రాపిడి ఎక్కువైనా_జ్ఞాపకాల ఓదార్పు ఉందిగా చెంతనే
8. తలపుల తోడు ఉందని_నీ మదికెంత అహమో
9. నిశీధిలో సైతం_నీ ఆనవాళ్ళు వెలుగు రెక్కలతో
10. గ్రీష్మానికి తావిస్తూ_వదలలేని వాసంతం
11. జ్ఞాపకాలు తట్టి లేపుతూనే ఉన్నాయి_మరచిందెక్కడ మిత్రమా
12. రానివ్వని రాదారి అది_పోవడమే తెలుసు వాళ్లకు తిరుగు దారి తెలియనివ్వదు
13. మరుపన్నది దరి చేరలేదు_మరణంలో సైతం నీ ప్రేమకు సాక్ష్యంగా

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner