17, డిసెంబర్ 2014, బుధవారం

అడగాలని...!!

మధనపడే హృదయానికి
మరణ రోదన వినిపించే
మృత్యు నిలయాల చిరునామా
నా పక్కనే ఉందని చెప్పనా...

అమాయకత్వాన్ని చిదిమే
నిరంకుశత్వం ఎదురుగా
అస్సహాయతతో వత్తిగిల్లే చెమ్మగిల్లిన
మనసుల మనోవేదన చూడనా...

కరడుగట్టిన పాషాణాల
చేతుల్లో నలిగిన నామరూపాల్లేని
మారణకాండకు సాక్ష్యాల్లేని మౌనాల
సందర్శనాన్ని పలకరించనా...

చేవ చచ్చిన ఉగ్రవాదాన్ని
చితిలో వేయమని చెప్పాలని
చాతనైతే న్యాయ పోరాటం నేర్చుకోమని
తెలపాలని రక్తాక్షరాలు రాయనా...

ఎందుకీ అమానుషత్వమని
మానవత్వం మరచిన రాక్షసత్వాన్ని
ఎన్నాళ్ళీ ఉన్మాదమని అడగాలని 
గొంతు చించుకు అరవాలని ఉందని చెప్పనా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner