5, జనవరి 2015, సోమవారం

ఏక్ తారలు...!!

4/1/15
1. శిశిరానికి కబురు చేరనేలేదు_అందుకేనేమో వసంతంలో గ్రీష్మాన్ని వదలడం లేదు
2. ఆకలే లేదు_అబద్దాల కేకలలో
3. మల్లెలతో సరిపెట్టుకుంటున్నా_నీ పరిమళం వాటికి సోకిందని
4. అమృత గానం సోకినందుకేమో_అమరత్వాన్ని అందుకుంది మది
5. చీకటి వెన్నెల సయ్యాట_చల్లనయ్యకు చుక్కలకు దోబూచులాట
6. నా మనసు అద్దంలో_ఎన్ని సార్లు చూసినా కనిపించేది నీ బొమ్మే
7. స్వప్నం పారిపోయింది_అసత్యానికి భయపడి
8. మనసుకెంత తపనో_ఎప్పుడు నీ తలపుల్లోనే ఉండాలని
9. మౌనం మాటలాడితే_అనుబంధం చేరువగా వస్తుందని అవమానానికి తెలుసుగా
10. తడబడకుండా వాస్తవాన్ని ఆహ్వానించడమే_జీవితపు పోరాటం
11. నిజ జీవితాల నటనలు చూసి_తెలుగు సినీ పరిశ్రమ నటులు నటించడానికి ఏమి మిగల లేదని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner