1, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఏక్ తారలు...!!

31/1/15
1. ముఖ చిత్రం చూసి మురిసిపోయా_మనసు  పుటల్లో లేనని తెలియక
2.  కన్నీరై జారినా_జ్ఞాపకంగా నీతోనే  ఉన్నా
3 . అడుగులొక్కటైన_ఆత్మ బంధం మనది
4.  'కల'వరాన్ని కూడా కదిలించాయి_కల్లలైన నీ కలలు
5. కాలమూ పరిగెడుతోంది_భావాలకు ధీటుగా
6. కలలకెంత కల్లోలమో_నీ రూపాన్ని వీడ లేక 
7. కనురెప్పలను అంటిపెట్టుకుంది కాటుక_కలలను నిద్ర పుచ్చుతూ
8. వియోగానికి ఎప్పుడూ నిరీక్షణే_విరహాన్ని చుట్టం చేసినందుకు
9. నీ అడుగుల్లోనే నా అడుగులు_నీ తోడే చాలంటూ
10. నీ కన్నుల్లో కాపురమున్నా_కారిపోనివ్వని కాటుక సాక్ష్యంగా
11. జ్ఞాపకాల అనుభూతి_అందమైన కలలకు చేవ్రాలుగా
12. అన్ని అనుమాన బంధాలే_స్వార్ధమే లక్ష్యంగా
13. ప్రేమలోని ప్రేమనే_ప్రేమించే ప్రేమగా
14. అన్ని కలసిన అనుబంధం_ఈ స్నేహబంధం
15. పలకరించే జ్ఞాపకాలే_ఏకాంతాన్ని దూరం చేస్తూ
16. ఈ లోకాన్నే మరిచా_మైమరపించే నీ ప్రేమ పారవశ్యంలో
17. మది ఎదురు చూస్తోంది_నీ రాక ఎప్పుడా అని
18. ఏ'కాంతం' లో కాంతను_మాయం చేస్తూ మీ మగ మహారాజులు

19. ప్రతి రోజు పండుగే_ పని  లేని పుంగవులకు
20. ఊపిరి విశ్వాసంగా చెప్పింది_తన ప్రేమ నీకేనని
21. కొలువు చాలించే క్షణాల కోసం ఎదురు చూస్తూ_మరో పారిజాతం

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner