6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఏక్ తారలు ....!!

5/2/15
1. అక్షరాలకు ఆరాధన_గేలానికి చిక్కనిది
2. నిత్యమూ పరిమళాలే_వసి వాడని నీ జ్ఞాపక సుమాలు
3. మనసంతా నీ తలపులే నిండి ఉంటే_తలుపుకి చోటెక్కడా
4. రేయి పంచుకుంది_పున్నమిని నీతో కలసి
5. శిశిరంలో ఈ వేడిమి ఎక్కడిదాని చూస్తే_నీ మరుల తలపై తగిలింది ఈ రాతిరి
6. పంచుకున్నా అక్షరాలతో_పెంచుకున్న మమతను
7. వదలి ఉండలేను_ఊపిరైన అక్షర బంధాన్ని
8. వశీకరమైంది మనసు_నీ హృదయంలోని ఆర్తికి
9. యాదికైనా రాకపాయే_ఎల్లువైన ఈ ప్రేమ
10. పుడమికెన్ని పులకింతలో_వర్షపు హర్షాన్ని ఆస్వాదిస్తూ
11. మనసు తెలిపే మధురభావనలే_ఈ ఒలికిన అక్షర నేస్తాలు
12. మనసు యజ్ఞంలో_ప్రతి భావమూ సమిదే
13. సాహితీ సేవకులే_కలంతో అక్షర సేద్యం చేసే ప్రతి ఒక్కరూ
14. కష్ట సుఖాలతో జీవన పయనం_అంతే లేని కాల చక్రంలో
15. అందుకోవాలి ఆనందం_విషాదాన్ని దూరం చేస్తూ
16. చంద్రోదయమే మనసుకు_వేదనలను చల్లబరుస్తూ
17. వినిపించని రోదనలెన్నో_కాల ప్రవాహంలో కొట్టుకు పోతూ
18. రేయి మురిసింది_నెలవంక తన సరసకు చేరాడని
19. గతాన్ని ఆరాధిస్తున్నా_నిన్నటి నీ జ్ఞాపకాలు నావైనందుకు
20 అక్షరాన్ని ఆరాధిస్తున్నా_ప్రతి భావమూ నీ కోసమైనందుకు
21. అక్షరాలకూ ఆరాధనే_వెల్లువైన నీ ప్రేమలో చేరి మురిసి పోతున్నందుకు
22. మనసుకు పరవశమే_అక్షర భావాలన్నీ నిన్నే చేరుతున్నందుకు
23. నీతోనే జీవిస్తున్నా _నా ఊపిరి నువ్వేనని తెలిసి
24. వాస్తవంలో వెదుకుతున్నా_నీ ఆరాధనాజ్యోతి వెలుగు కోసం
25. మిన్నల్లో ఉండిపోయా_నీవు లేని వెన్నెల నాకొద్దని
26. పరవశమై తాకుతున్నాయి_నీ భావనల ఆరాధనా పరిమళాలన్ని
27. హర్ష తుషారమై అల్లుకుంటా_వెల్లువైన నీ ప్రేమకు
28. విరిజల్లై తాకుతా_వలపు వర్షిస్తూ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner