20, ఏప్రిల్ 2015, సోమవారం

కడవరకు ఉండిపో ఇలానే....!!

మనసుకెంత ఆరాటమో
లోలోపలి పొరల్లో వెల్లువెత్తే
మధనాన్ని ఆపాలని....

తనువు కెంత తపనో
దూరమైన బాంధవ్యాన్ని కలిపేస్తూ
తన దరిని చేరాలని...

వలపుకెంత కోరికో
వలచిన వన్నెల వెన్నెలలు
తన మోవిలో చూడాలని...

తీరానికెంత తొందరో
అలల తాకిడి తనను తాకే 
కలయికలో మమేకం కావాలని... 

వేల జన్మాల ఎదురుతెన్నుల్లో
వరమై అరుదెంచిన ప్రియ నేస్తమా
కడవరకు ఉండిపో ఇలానే....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner