19, ఏప్రిల్ 2015, ఆదివారం

మనిద్దరికే సొంతమైనదని.....!!

అటు ఇటు పరుగులెత్తుతోంది
మనసుని కుదురుగా ఉండనీయని
తొందరేదో తట్టి లేపుతూ...

పలకరించిన అక్షరాన్ని అడిగితే
పక్కున నవ్వింది నీకు తెలియదా అన్నట్టు
భావాలను పరుస్తూ...

మౌనమైన మాటని ఊసులేమని అడిగితే
మోవిపై మెరిపించింది ఓ ముసి ముసి నవ్వు
నిన్ను తలపిస్తూ....

కలలను కదిలించి అదిలించా
కలవరపాటుగా తొలిగిపోతున్నాయి
నిన్ను స్వప్నాల్లో దాచేస్తూ...

ఎదలోని సవ్వడులు ఎందుకో 
ఉలికిపాటుగా వెలుపలికి తొంగి చూస్తున్నాయి
నీ అలికిడి తెలిసిందేమో మరి...

అప్పుడనుకున్నా నా చెంత చేరింది
నీతో కలసిన మన అందమైన జ్ఞాపకమని
మనిద్దరికే సొంతమైనదని.....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner