6, ఏప్రిల్ 2015, సోమవారం

నేనింతే...!!

ఏవిటోనండి ఈ మధ్య కబుర్లు కాకరకాయలు అన్ని నా నేస్తానికే చెప్పేస్తున్నా అని చాలామంది కంప్లయింట్లు... సరే ఓ పాలి మీ అందరికి కూడా కాకరకాయలు వదిలేసి కబుర్లు చెప్పేద్దామని ఇలా వచ్చేసానన్నమాట... కాని చేదు లేకుండా ఏం బావుంటాయి కబుర్లు అని మళ్ళి మొదటికే వస్తున్నా... మొన్న బాంక్ కి వెళ్ళానా అక్కడో పెద్ద క్యూ ఉంది .. ఏం చేస్తాం అక్కడ కూడా 30% రిజర్వేషన్ అంటే కొట్టేస్తారేమో అని నేను లైన్ లో నిలుచున్నా... నా తరువాత ఇద్దరు కాలేజ్ పిల్లలు అనుకుంటా వచ్చారు.. ముందు బానే లైన్లో నిలుచున్నారు.. అంతలోనే ఏం గుర్తు వచ్చిందో  ఏమో లైన్ నుంచి తప్పుకుని ముందుకి వెళ్ళి నిలుచున్నారు... ఓ ఇద్దరు అయ్యాక వీళ్ళు అటు నుంచి తమ పని చేసుకోబోతుంటే నేను ఊరుకోలేక నవ్వుతూనే ఏమ్మా మీరు చదువుకోలేదా అన్నా.... ఓ క్షణం వాళ్ళకి ఏం ఆర్షం కాలేదు .. తల ఊపి వెనక్కి వచ్చి లైన్ లో నిలుచున్నారు... అక్కడ ఉన్న మిగతావాళ్ళు ముసి ముసిగా నవ్వుకున్నారు... ఆ పిల్లలని చిన్నతనం చేయాలని నేను అనలేదు... కనీసం అక్కడ లైన్లో అందరు ఎందుకు ఉన్నారో అర్ధం చేసుకుంటారని చెప్పాను... పిల్లలు పెద్దలు అని లేదు ఎవరైనా ఒక పద్దతి ఉన్నప్పుడు దాన్ని అందరు పాటిస్తే అంతా సవ్యంగా జరిగి పోతుంది... ఏం చేద్దాం చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం నాది... అందుకే అంటారు చాలా మంది నీకెందుకు నీ పని నువ్వు చూసుకుని పోరాదు అని... కాని అలా చూస్తూ ఊరుకోలేకే కదా ఇలా అందరితో తిట్లు తింటూ ఉంటాను... మరి ఇలా ఉండటం తప్పో ఒప్పో నాకు తెలియదండి... నేనింతే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner