31, జులై 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పంతొమ్మిదవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో తెలుగు సాహిత్యపు కవి యుగాలలోని కొన్ని ముఖ్య  ఘట్టాలను  తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం తెలుగు వైభవానికి స్వర్ణ యుగమైన రాయల వారి యుగం గురించిన వివరాలు, ప్రబంధం గురించి సంక్షిప్తంగా చూద్దాం..మన అందరం విని ఉన్నాము.. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మేవారని... రాయలవారి ఆస్థానమైన సభా మండపం  భువనవిజయమన్న పేరుతో అష్టదిగ్గజాలతో విలసిల్లేదని చతురోక్తుల తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ... "మేక తోక పద్యం"... కాస్త లోతుగా చరిత్ర వివరణలోనికి వెళ్తే....

1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.

పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా

తిరుమలవెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
కులము

శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369

ప్రబంధ యుగము

తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.

పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
లక్షణాలు

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.

    పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
    కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
    దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
    సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.

    ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.

    రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.

    మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.

    నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.

    వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.

చరిత్ర రచనలో

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంద యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.
ఉదాహరణలు

    మనుచరిత్ర
    సంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము
    ఆముక్త మాల్యద
    నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
    ముకుందవిలాసము
    వీరభద్ర విజయము

ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

ముందు మాట....!!


'తెలుగు సాహితీ ముచ్చట్లు' కు స్వాగతం!..
'మంజు' యనమదల...
ఈమె పేరు వింటేనే చాలు ... అభిమానం పొంగుకు వస్తోంది!..
మంజు గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే..
మంచి తనానికి మారు పేరు మంజు గారు!.. మంచి రచయిత్రి...
ఏ బాధ్యత చేపట్టినా ఓ నిబద్దతతో చేస్తారు..

ఈమె పుట్టింది... కృష్ణాజిల్లా జయపురం..
స్వస్థలం.... నరసింహాపురం..
పెరిగింది... అవనిగడ్డ, విజయనగరం.. చదివింది అక్కడే.
ఇంజనీరింగ్ చేసి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసారు..
అవనిగడ్డలో అధ్యాపకురాలిగా కొనసాగారు..
అమెరికాలో ఎనిమిది ఏళ్ళు జీవనయానం అనంతరం
భాగ్యనగరంలో నాలుగు ఏళ్ళు ప్రాజెక్ట్, క్వాలిటి మేనేజర్ గా పనిచేసారు.
* అపురూపమైనదమ్మ ఆడజన్మ..
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మని గుర్తు చేస్తూ...
ఇంటి ఇల్లాలిగా, తల్లిగా, కూతురిగా, మనుమరాలిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నతమైన బాధ్యతలతో.. ప్రస్తుతం తమ జీవన ప్రయాణం సాగిస్తోంది.
మంజు గారి సాహిత్య నేపద్యం అంటారా?!...
ఇక ఆమె మాటల్లో చెప్పాల్సిందే!..
" మా నాన్నగారికి సంగీత, సాహిత్య, నాటక అభిరుచి ఎక్కువ...
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు...
కనపడిన ప్రతి పుస్తకమూ చదివేయడమే...
జరిగిన సంఘటనలు రాయడం మొదలు పెట్టి.. ఉత్తరాలతో జత కలిపి...
'తెలుగు' రాదన్న తెలుగు మాష్టారి మీద కోపంతో...
తెలుగంటే బోలెడు ఇష్టాన్ని పెంచుకుని...
అనిపించిన భావనలు పంచుకొని..
ఇలా సాహిత్యంతో..
'సాన్నిహిత్యం' ఏర్పడింది" అంటారు మంజు గారు!..
మరి ఇతంటి సాహిత్యాభిరుచి కలిగిన 'మంజు' యనమదల గారిని
ఈ కూటమిలో వారం .. వారం ఓ వ్యాసం రాయమని 'సాహితీ సేవ' అడిగింది.
సాహిత్యం గురించి నాకేం తెలుసంటూ.. తటపటాయిస్తుండగా మీ 'కబుర్లు, కాకరకాయలు' చూస్తుంటాం .. మీరు రాయగలరు, రాయండి' అనగానే అంగీకరించక తప్పలేదు మంజు గారు.
ఎట్టకేలకు వారం ... వారం ... ప్రతి శుక్రవారం " తెలుగు సాహితీ ముచ్చట్లు ' శీర్షికన రాయటానికి అంగీకరించారని తెలియచేయులకు సంతోషిస్తున్నాం.
తెలుగు సంస్కృతి కుసుమం.. శ్రీమతి మంజు యనమదల గారి " తెలుగు సాహితీ ముచ్చట్లు" కు స్వాగతం పలుకుదాం.
రేపటి శుక్రవారం వెలువడే " తెలుగు సాహితీ ముచ్చట్లు" శీర్షికను ఆదరించండి!..
మంజు గారిని ఆశీర్వదించండి!... ప్రోత్సహించండి!..
జయహో తెలుగు సాహిత్యం
సదా సేవలో,
కంచర్ల
ఆర్వీ యస్ యస్ శ్రీనివాస్
రామకృష్ణ చౌదరి జాస్తి,
సుకన్య బీగూడెం,
డా. కత్తిమండ ప్రతాప్,
పుష్యమి సాగర్
సాహితీ సేవ.

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఎనిమిదవ భాగం....!!

ఇప్పటి వరకు నాకు తెలిసిన వృత్తాల గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న  వివరాలు మీకు అందించాను... వృత్తాలు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల అనే నాకు తెలుసు... అంతర్జాలంలో వెదికితే మరికొన్ని వృత్తాల గురించిన వివరాలు దొరికాయి.... వాటిలో తరళము, తరలి, మాలిని కొత్తగా కనిపించిన వృత్తాలు... ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి.... వాటి గురించి మళ్ళి వారం చూద్దాము... దిగితే కాని లోతు  తెలియదు... ఒడ్డున ఉండి రాళ్ళు వేసేవాడికేమి తెలుసు... అన్న సామెత ఎంత నిజమో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది... సాహిత్యానికి ప్రాణాధారమైన భాషను గురించి నాకు తెలిసిన అది మా తెలుగు మాష్టారు చెప్పింది... నాకు బాగా ఇష్టమైన అమ్మ భాష గురించి నాలుగు ముక్కలు చెప్పేద్దామని గబ గబా మొదలెట్టేసానా... సముద్రంలో ఓపికగా వెదికిన కొద్ది మరకతమణులు, మాణిక్యాలు దొరికినట్లు ఈ సాహితీ ముచ్చట్ల కోసం వెదికిన వెదుకులాటల్లో ఎన్ని మణి మాణిక్యాలు మీతోపాటుగా నాకు దొరుకుతున్నాయో.... ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన సాహితీ సేవకు వందనాలు.... ఇక ఈ వారం వృత్త వివరణలు చూద్దామా....
తరలము

    ఇది మత్తకోకిలకి జంట వృత్తము
    మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.

 లక్షణములు

    పాదాలు : నాలుగు
    ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
    యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
    ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

నడక

    మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
    తనన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

ఉదాహరణ 2

క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569

తరలి పద్య లక్షణములు

    వృత్తం రకానికి చెందినది
    ధృతి ఛందమునకు చెందిన 97247 వ వృత్తము.
    18 అక్షరములు ఉండును.
    23 మాత్రలు ఉండును.
    మాత్రా శ్రేణి: U I I - I I U - I I I - I U I - I I I - U I U
        త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I I I - U I - U
        చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - I I U - I U
        పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I I I U - I U
        షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I I I - U I U
        మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I I I - U I U
    4 పాదములు ఉండును.
    ప్రాస నియమం కలదు
    ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
    ప్రతి పాదమునందు భ , స , న , జ , న , ర గణములుండును.

ఉదాహరణ 1

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

మాలిని

సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.

లక్షణములు

    పాదాలు : 4
    ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
    యతి : 9వ అక్షరము
    ప్రాస: కలదు

నడక

    ననన ననన నానా | నాననా నాన నానా

ఉదాహరణ 1

దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!

భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!

ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!

ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!

తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
తరలము(ధ్రువకోకిల)----న-భ-ర-స-జ-జ-గ----యతి-12
తరళము------------7నగణములు+గురువు----యతి-13

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

ఏక్ తారలు...!!

1. కలల్లో ఎన్ని కావ్యాలో_ఊహలకు ఊతం ఇచ్చినట్లు
2. నిరాశకు చరమ గీతం_నిశిలో సైతం వెలుగు పూల వర్షం
3. కాలం కాపలా కాయలేక పోతోంది_ఏకాంతానికి తాకే జ్ఞాపకాల రాకకు
4. వార్ధక్యం నవ్వుతోంది_ముని సంతానంలో తన బాల్యాన్ని చూసుకుని
5. వెల కట్టలేని సుస్వరాలు_నీ స్నేహ సాంగత్యంలో
6. చల్లని చెలిమికి_కరిగే వెన్న వంటి మనసే సాక్ష్యం
7. గమనమే గమ్యం_జ్ఞాపకాల సంద్రాన్ని ఈదుతూ
8. ఇలాగే బ్రతకాలనుంది_నీలో ఎప్పటికి సజీవ జ్ఞాపకంగా
9. ఇలాగే బ్రతకాలనుంది_సడి చేయని చెలిమి చెంత
10. ఇలాగే బ్రతకాలనుంది_బ్రతుకు అర్ధానికి చిరునామాగా మారి
11. ఆత్మాభిమానమూ ఎక్కువే_శరాల్లా అక్షరాలను సంధించడంలో
12. కోరికలన్నీ తారల్లో దాగున్నాయేమో_నేలకు చేరి నిన్ను వరించే తొందరలో రాలినట్లనిపిస్తూ
      

30, జులై 2015, గురువారం

త్రిపదాలు...!!

1. నింగి కెగసిన రుధిరంలో 
    శ్వేత వర్ణాన్ని దాయలేక
   నేల రాలుతోంది శాంతి కపోతం
2. కలలకెంత కలవరమో
   రెప్ప తెరిస్తే
   రెప్పపాటున కనుమరుగౌతావని
3. గుండె గొంతులో మౌనాలు
   మది కన్నీటి జలపాతాన్ని
   కనుకొలుకుల్లో దాచేస్తు
4. కన్నీటి జలపాతాలు
అంతరంగ కల్లోలానికి
సాక్ష్యాలుగా మారిన క్షణాలు


    

29, జులై 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1. పవళింపులోనూ _నీ జ్ఞాపకాల గమకాలే
2. శిశిరాలు శిధిలమైనా_మళ్ళి వచ్చే వసంతాగమనం కోసమే కదా
3. కన్నీళ్ళను దాచేస్తూ_అలంకృతమైన అలంకారాల నవ్వుల జీవం వేరేక్కడో
4. కనిపించే చిరునవ్వు చాటుగా_దోబూచులాడుతూ కన్నీటి కెరటం
5. తొంగి చూస్తోంది కన్నీటి ముత్యం_కలతల కథల వ్యధలను దాచేస్తూ
6. మానవత్వం మరుగున పడకపొతే_ప్రతి సమానత్వంలోను మహనీయ రూపమే
7. నింగిలోని అణు ధార్మికత కోసం_భువి నుంచి దివికి స్వాగతించాయి
8. మరణం తరువాత_మిగిలి పోయిన రహస్య ఛేదనకు ఈ అనుకోని పయనం
9. వెన్నెల్లో వరించింది_వికసించిన వసంత పరిమళం

28, జులై 2015, మంగళవారం

రాలిపడింది వెన్నెల కెరటం....!!


వేల యుగాల నిరీక్షణకు
దొరకని సమాధానాన్ని
ఎక్కడో వెదుకుతున్నా

వాడి పోయిన పువ్వుల్లో
తరగని పరిమళాన్ని
ఆస్వాదిస్తూనే ఉన్నా

స్తబ్దంగా మారిన మదిలో
నిస్సత్తువగా నిలబడిన
వాస్తవాన్ని చూస్తున్నా

చితికి పోయిన జ్ఞాపకాలలో
నీలి నీడల చిత్రాల కోసం
తరచి తరచి పరికిస్తున్నా

నువ్వు వదలి పోయిన
గత గవాక్షంలోనే ఎదురుచూస్తూ
అక్షరాలతో సహ జీవనం చేస్తున్నా

రాలిపడిన వెన్నెల కెరటంతో 
మరో పున్నమిలో చెలిమి చేద్దామని
వేకువ వెన్నెల రెక్కల చాటుకు చేరా

పరుగులెత్తుతూ వెళిపోతున్న కాలంలో
నువ్వు లేని క్షణాలను నిరాకరిస్తూ
జీవితానికి అర్ధాన్ని మరచి పోతున్నా...!!

26, జులై 2015, ఆదివారం

నీకు తెలుసు....!!

కాలే కడుపుకి తెలుసు
ఆకలి ఎలా ఉంటుందో  

రగులుతున్న గుండెకు తెలుసు
గాయాల బాధ ఏమిటో

నిశబ్దానికి మాత్రమే తెలుసు
ఏకాంతంలో మాటలు వినడమెలానో

మౌనానికి తెలుసు
ముత్యాల సరాలు ఎలా ఉంటాయో

అనుబంధానికి తెలుసు
ఆత్మీయత ఏమిటో

సంద్రానికి తెలుసు
అలల సవ్వడిలో కథల హోరు

కోపానికి తెలుసు
మది సంతోషం ఏమిటో

పాశానికి తెలుసు
మమకారం ఎలా ఉంటుందో

జ్ఞాపకాలకు తెలుసు
ఘనమైన గతం ఎలా ఉంటుందో

జీవితానికి తెలుసు
జీవం లేని చిరునవ్వు ఎలా ఉంటుందో

నీకు తెలుసు
నువ్వు లేని నేను ఎలా ఉంటానో....!!

ఏక్ తారలు....!!

1. అనుబంధము ఆత్మీయంగా పలుకరిస్తుంది_అసహనం సహనంగా మారితే
2. వసంతం సంతసమైంది_నీ రాక తెలిసి
3. సమీరం చల్లగా తాకింది_వసంతలో మనం సంతసమని
4. వేసవిలో వసంతం వచ్చింది_నీతో చెలిమి చేసాక
5. నీటి మీది రాతలు నవ్వుతున్నాయి_నీ మీద నాకున్న నమ్మకాన్ని చూసి
6. అలసిన పొద్దు వాలుతోంది_వెన్నెల్లో చుక్కలకు నీ మేని మెరుపులద్దుతూ
7. చీకటి చిరునామా చెరిగి పోయింది_వేకువ పొద్దులో నీ చిత్రాన్ని చూస్తూ
8. రాయబారానికెళ్తున్నా_తులాభారం కట్నమడుగుతారేమో
9. నవ్వుల్లో రాలుతున్నాయి_మనసు మౌనాల ముత్యాలు
10.  పరిమళాన్ని ఆస్వాదించే మనసుకు_మల్లెల పారిజాతాలే ఎటు వెళ్ళినా
11. అవరోధాలను తొలగిస్తూ ఆత్మీయ బంధం_అడ్డంకిని అధిగమిస్తుంది
12. ఎలా చిత్రించినా_మనసు చూపించేది నీ రూపాన్నే
13. నమ్మకమే పునాదిగా మారింది_కన్నీళ్ళను ఘనీభవింపజేస్తూ
14. మెరుపు వెలుగులో మైమరచా_చిక్కుకున్న బంధాన్ని విప్పలేక
15. వెన్నెల నవ్వుకు_కోపంతో ఎరుపెక్కిన సూరీడు
16. వసంతపు చెలిమికి_కన్నెర్ర చేసిన గ్రీష్ముడు
17. ఒంటరితనమేలా_ వేల తారల చెలిమి నీ తోడుండగా
18. తలపుల్లో కావేరిలా_ప్రతి క్షణమూ నీ వెన్నంటే
19. వింటున్నా_మౌనంలో నీ పలుకుల రాగాన్ని

మీరే ఆలోచించండి నేస్తం...!!

నేస్తం,
          ఏంటో ఈమద్య బోలెడు కబుర్లు చెప్పాలని ఉన్నా ఎందుకో మరి అక్షరాలు సహకరించకో, భావాలు అటూ ఇటూ పరుగులెత్తుతూ దొరకక పారిపోతూనో.. ఆగిపోయిన మనసు అలజడిని నీతో పంచుకోలేక పోయాను... ఈ ముఖ పుస్తకానికి రోజు మనం రాకపోయినా పోయేదేం ఉండదు... వచ్చి గంటల తరబడి ఉన్నా ఒరిగేదేం ఉండదు... ఏదో మన ముచ్చట్లు నాలుగు పంచుకోవాలనిపిస్తే పంచుకుంటాం లేదా నలుగురివి నచ్చితే నాలుగు స్పందనలు, ఇష్టాలు తెలుపుతాం... దీనివల్ల మనకు పోయేదేం లేదు.. మన జీవితాన్నే ముఖ పుస్తకానికి అంకితమిచ్చేసినట్లు మనం అనుకోనక్కర లేదు.. మన భావాలు ఎదుటి వారు గౌరవించినట్లే మనము కనీసం మనకు నచ్చిన ఓ నలుగురి భావాలకు మన స్పందనలు తెలిపినంత మాత్రాన మన సమయం ఏం తరిగిపోదు... ఎవరమైనా మనకు అనిపించిన భావాలు పంచుకోవడానికి ఈ ముఖ పుస్తకాన్నే వేదికగా చేసుకుంటున్నాము... మనకున్న సమయంలో కాస్త మన అభిప్రాయాలు పంచుకోవడానికి ఏదో మనకు వచ్చిన భాషలో తెలియపరుస్తున్నాము... మనకు నచ్చిన ఓ నాలుగు పోస్టులకు స్పందిస్తున్నాము... దీని కోసం జీవితమంతా ముఖ పుస్తకంలోనే ఉన్నట్టు మనం భావించనక్కర లేదు... మనం ఏదో గొప్పగా రాసేసామని మనకు స్పందనలు బోలేడు వస్తున్నాయని గర్వంగా అనుకోనక్కరలేదు... మనకు, మన భావాలకు విలువ ఇస్తున్నారంటే అది ఎదుటి వారికున్న సంస్కారం... ఆ సంస్కారమున్న ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు.. ఎవరి జీవితాలు, బాధ్యతలు, వృత్తి, ఉద్యోగాలు వారికి ఉంటాయి... ఓ నాలుగు నిమిషాలు మనము మన సంస్కారాన్ని తెలిపినంత మాత్రాన మనకు పని పాటా లేక మన జీవితాన్ని ముఖ పుస్తకానికి అంకితం చేసినట్లు కాదు... సమయం మన చేతిలో ఉండాలి కాని మనం దాని చేతిలో ఉండకూడదు... మన రాతలకు కేటాయించిన సమయాన్నే కొద్దిగా ఎదుటి వారి భావాలకు విలువ ఇవ్వడానికి ప్రయత్నిస్తే మనకు వచ్చిన ఆనందమే ఎదుటి వారికి వస్తుంది... ఏం మన సంతోషానికి కారణమైన వారికోసం మనమూ ఓ నాలుగు నిమిషాలు కేటాయించలేమా.. మీరే ఆలోచించండి నేస్తం...!!
 నీ నెచ్చెలి

24, జులై 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

1. తొలి మంచు తరుగుతోంది_తుషారపు సూరీడుని స్వాగతించేందుకు
2.  మది పారవశ్యానికి లోనౌతోంది _నీవు దగ్గరయ్యే క్షణాలను లెక్కిస్తూ
3. ఎన్ని జన్మాలకు జతగా నిలుస్తోందో_నిజమైన ప్రేమలో మాధుర్యం
4.  మెరిసి మురిసిన వర్షం హర్షం_వెల్లువెత్తిన నీ ప్రేమ సంకేతం
5.  కదలి పోతోంది కాలం_యుగాల నిరీక్షణకు తెర దించేద్దామని
6. నీ చేరువలోక్షణాలు యుగాలైతే_నిరీక్షణకు చోటెక్కడ ఇక
7. ఎదురు చూపుల ఆంతర్యం పసిగట్టిందేమో కాలం_క్షణాల యుగాల కోసం ఎదురు చూస్తూ
8. మురిసి మున్నీరౌతూ నవ్వులు_కష్టం లోను ఆనంద భాష్పాలు రాలుస్తూ
9. అనునయానికి అలసట ఎక్కువైంది_రాలిన మాటల ముత్యాలను ఏరుకోలేక

23, జులై 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. నిశబ్దంలోను నీ ఊసులే_ఇక మౌనానికి మాటల తావెక్కడ
2. కలలు కావ్యాలై విరాజిల్లుతున్నాయి_నీ ఊహల్లో తేలియాడుతూ
3. జీవితానికే కొత్త అర్ధం తెలిసింది_నీ సాన్నిహిత్యంలో
4. నిశిలో అందాలు_నీ వన్నెల వెలుగుల్లో
5. కలానికెంత సంతోషమో_నీ విజయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేందుకు
6. కన్నీటిలో కరిగి పోతున్నా_కనుపాపలలో కాస్త చోటివ్వవూ   

21, జులై 2015, మంగళవారం

ఇదో చక్కని జ్ఞాపకం ...!!

 తెలుగు రక్షణ వేదిక 2015 జులై 18న నిర్వహించిన మహా పుష్కర గోదావరి కవితోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన పోట్లూరి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు... ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి పాత్రధారి సూత్రధారి అయిన పద్మా శ్రీరాం గారికి ధన్యవాదాలు... సహ కవి మిత్రులు అందరికి మనఃపూర్వక అభినందనలు... ఇదో చక్కని జ్ఞాపకం ...!!

ఏ రామదాసు ఏతెంచాలో...!!

ఒకప్పుడు నిత్య కల్యాణం పచ్చతోరణంగా
కళ కళలాడిన మా ఊరి సీతారామయ్య
ఈనాడు రంగులు వెలసి ధూప దీపాలకు
మొఖం వాచిపోయి వెలా తెలా పోతున్నాడు
పక్క ఊరిలోని కొత్త దేవుళ్ళ దెబ్బకు
మనలోని క్షణానికోసారి మారే నమ్మకాలకు
అచ్చం వలస వెళ్ళిపోయిన ఖాళీ గుమ్మాల్లా
అంతిమ యానానికి సిద్దమైన జీవితాలు
బిడ్డల కోసం ఎదురు చూస్తున్న బోసి నవ్వుల్లా
డొక్కలు ఎండిపోయి ఉడిగిన వయసులా
మంగళ వాయిద్యాలతో పసుపు బట్టల కొత్త జంటకు
ప్రధమ దీవెనలిచ్చిన జానకి రామయ్యకు
నిలువ నీడ లేకుండా పోయింది
ఏడాదికి ఒక్కసారి పట్టాభి రామయ్యకు
జరిపే లాంచనాల ముత్యాల తలంబ్రాల నడుమ
ముద్దుగుమ్మ సీతమ్మను పరిణయమాడే
సుముహూర్తం వెల వెల పోతోంది
కళ కళలాడే కళ్యాణ సీతారాములను
మళ్ళి చూడాలంటే ఏ రామదాసు ఏతెంచాలో...!!

త్రిపదాలు....!!

1. మేలిముసుగు వేసుకున్న వేకువ
మంచు తెరల్ని తాకుతూ విచ్చుకుంటున్న
తుషారాన్ని నీలో చూస్తున్నా

2. జ్ఞాపకాలు పదే పదే
జ్ఞాపకం వస్తున్నాయెందుకో
అనుక్షణం నీతో జత కడుతున్నందుకేమో

3. మిన్నల్లో నే ఉండిపోయినా
వెన్నెల్లో నీతో చేరిపోతున్నాయి
నాకంటూ మిగలని నీ గురుతులు

పుష్కర గోదారి....!!

 గోదారమ్మకు పుష్కరాలొచ్చెను
సకల జనుల పాపాలను హరియింప
పన్నెండేండ్లకు ఒకసారి పలకరిస్తూ
చల్లని వానల సందడిలో పుష్కరుడేతెంచెను
కళ కళలాడుతూ కిల కిలలాడెను గోదారమ్మ
తనను చూడ ఏతెంచిన చుట్టాలందరిని చూసి
కోనసీమకు పచ్చని కుచ్చుల పైరుల పట్టుకోక గట్టి
కళల కాణాచి రాజమహేంద్రినికావ్య నాయికను చేసి
వేదాల నాదాన్ని మ్రోగిస్తూ గాంభీర్యంగా సాగుతూ
వెన్నెల్లొ హొయలు చిందే ఒంపు సొంపుల సొగసరి
సిరులు వెదజల్లే సిరి మాలచ్చిమి
ప్రాణాధార జలనిధి సాగరానికి చేరుతున్నా
ఆద్యంతాల పుష్కరాల పండుగ చూడ
వేయి కనులైనా సరిపోవునా
మరో పుష్కరానికై ఎదురుచూడ...!!

19, జులై 2015, ఆదివారం

పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!


నిన్న జరిగిన తెలుగు రక్షణ వేదిక " గోదావరి మహా పుష్కర కవితోత్సవంలో నేను చదవలేక పోయిన నా కవిత "
పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!

గోహత్యా పాతక విముక్తికై గౌతముడు
పరమశివుని మెప్పించి గంగను భువికిదెచ్చి
గోదావరిగా ప్రవహింపచేసి సకల పాపాలను హరియింప
పూర్వులకు పుణ్య లోకాల సద్గతులను అందింప
నాసికాత్రయంబకం నుండి ఏతెంచి గోష్పాద క్షేత్రమై
విలసిల్లుతూ ఉభయ గోదావరీ ప్రాంతాల నడుమ
వేద నాదాల మోదంతో రాజమహేంద్రిని అలరించి
అంతర్వేదాన్ని అద్భుత గాంభీర్యాన్ని తనలో దాచుకున్న
అంతర్వాహినుల పుణ్య త్రివేణి సంగమ పవిత్రత
జీవ ధారలను ప్రాణ ధారలుగా అందించే నదీమతల్లి
వెన్నెల అందాల విన సొంపైన కావ్యాల సృష్టి
పచ్చని పైరుల పట్టుకోకల సందడిలో
చెలియల కట్టలో సాగరుణ్ణి కలుసుకున్న
అనంతవాహిని ఈ గౌతమి గోదావరి
పన్నెండేడ్లకోసారి పుష్కరమల్లే
గురువు అడుగిడిన సింహరాశిలో
పుష్కరుని ఆహ్వానించి పుష్కర స్నానాల్లో
పుణ్య గతులను ప్రాప్తింప చేసి
పాప భారాన్ని సుతిమెత్తగా మోసుకుంటూ
సాగరాన్ని చేరుకునే చూడ చక్కని సిరుల వేణి
పుష్కర పునీత ఈ గోదారమ్మ...!!

18, జులై 2015, శనివారం

ఏక్ తారలు...!!

 1. మనసు ప్రాకారాన్ని దాటింది ప్రేమ_నీ చూపుల చురుకు తగిలి
2. మాటలు ముక్తాయింపునిచ్చాయి_ అంబరాన్నంటిన నీ ఆత్మీయతను చూసి
3. మనసునెరిగిన బాస ఒక్కటి చాలదూ_వేల భాషలకు ధీటుగా
4. కెంపులు కళ కళలాడుతున్నాయి_నీ మేని పసిమి ఛాయకు పోటీగా
5. దాసోహమయ్యింది_మనసులోని మమతకు
6. నీ చిరునామా నాకెందుకు_నీవే నాలో కొలువై ఉండగా
7. రేపటి పొద్దును నేను_నిన్నటి నీ వెలుగుల సాక్షిగా
8. మరపులో మైమరపు చేరింది_రెప్ప మాటున నీ రూపాన్ని చూసి
9. రవళించే రాగమే_పొంగుతున్న అనురాగ సంద్రమై

16, జులై 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. వాస్తవాలకు జీవం పోస్తున్నాయి_నీ ఉహల ఊపిరులు
2. ఎన్ని నవ్వులు రువ్వాలో_నీ మౌనాలు మాటాడేందుకు
3. కలల నిండా నువ్వే_కదలాడే జ్ఞాపకంగా
4. పున్నమి వన్నెలే చెలి సింగారాలు_వెన్నెల వగచేలా
5.  మనసొలికించిన మధువుకు_అమాస పున్నమిలతో పనేలా
6. తబ్బిబ్బవుతూ గోదారమ్మ_చుట్ట పక్కాల సందడితో
7. పాప పుణ్యాల భారం మోస్తూ_గోదారమ్మ గాంభీర్యం
8. కనికరమే లేని జన్మకు చేవ్రాలు_లిఖించిన ఖర్మ ఫలిత నిర్దేశకుడు
9.  ప్రతి నవ్వులో విరిసిన మనసు_పరిమళించిన స్నేహ సౌరభం
10. వాస్తవాలు వెలుగు చూసే_కవి కలానికి ప్రాణం వస్తే
11. నీవున్న క్షణాల కోసం_నా కాలాన్ని వదిలేస్తా
12. రవికి మేలుకొలుపు_రాగాలాలపించే కూనలమ్మల కిల కిలలతో
13. ముక్కల్లో చూసినా_అపార్ధపు ఆనవాళ్ళే
14. అపార్దానికి అసూయెక్కువ_అభిమానాన్ని చూడలేక
15. అణువంత ఆదరణ చాలదూ_ఆకాశానికి నిచ్చెనలు వేయడానికి
16. మాటల్లో తేనెలొలుకుతున్నాయి_మనసులోని ఆత్మీయతతో జత గూడి
17. వన్నెల విసుర్లు వెన్నెల్లో_సిగ్గుల మొగ్గలు ఏరుకుంటునందుకేమో
18. జీవితమే_మధుర జ్ఞాపకాలను వెంటేసుకుని
19. కెంపులు దోబూచులాడుతున్నాయి_చెలి బుగ్గలో చేరి
20.  మమతలన్ని నీకే_మరుజన్మకు ఆనవాలుగా
21. ఖర్మ ఫలితాన్ని తగ్గిస్తాడేమోనని_కుసింత ఆశ
22. క్షణాల కాలం అడ్డుగా ఉంది_మనిద్దరి మధ్యనా అందుకేనేమో
23. వలపులు ఒయ్యారాలు ఒలుకుతున్నాయి_చెలి సిగ్గులకు చేయూతగా

15, జులై 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. వలచిన మనసు చూడదు_తల(లు)పుల అనుమతి కోసం
2. శ్రావణం ఎదురు చూస్తోంది_ఆషాడాన్ని ఎప్పుడు తరిమేద్దామా అని
3. నవరసాలు వెల్లువెత్తాయి_మధుర కావ్యానికి మోకరిల్లుతూ
4. పుష్కరాల సంబరానికై_హరివిల్లును అరువడిగిందేమో గోదారమ్మ
5. గోదారి పుష్కరాలట_ఆసనాలు వలస వెళ్ళినట్లున్నాయి
6. అంబరం హారతి పడుతోంది_పుడమి ఒడిలో సీతమ్మ జననానికి
7. గాలికి వాటమెక్కువ_అందుకే ఆశలు గాలి వాటుకి పయనమయ్యాయి
8. సమయానుకూల స్పందనే_వేవేల వర్ణాల భావావిష్కరను అక్షరాలకద్దుతూ
9. మోసపోయిన నమ్మకాలకు_పుష్కరాల్లో తర్పణాలు వదిలేద్దామని
10. గోదాట్లో గల్లంతైన ప్రాణాలు_బ్రతుకు బాటను ఖాళీ చేస్తూ
11. శోక సంద్రంలో నిండుగా గోదారి_ఆప్తుల ఆనవాళ్ళను మోసుకెళ్తూ
12. స్వప్న విహారానికి సమయమయ్యిందట_రేయమ్మ ఆగలేనంటోంది
13. సకల కళా పారంగతులే పండితులు_రవి కాంచని చోటును కవి కాంచుతూ
14. శతావధానమే_ చెలి కన్నుల్లో కాశ్మీరాలను చూడబోతే
15. మది దోచిన మనస్విని తలపుల్లో చేరి_మలయ మారుతమే దరి చేరింది
16. పిలువని పేరంటం అవుతుందేమోనని _ఆత్మీయత మది వాకిట వేచి ఉంది
17. వరాల జల్లులో తడిసి ముద్దయ్యాడు_మగువ మనసు గెలిచిన ధీరుడు
18. మధుర జ్ఞాపకాల మధుర తల్పమే_గెలుపు అనుభూతిలో ధీర జంటకు

14, జులై 2015, మంగళవారం

అర్ధం కాని అయోమయంలో ...!!

నేస్తం,
        నువ్వు వినే ఉంటావు ఈ నానుడి " పరోపకారార్ధం ఇదం శరీరం " .... ఒకప్పుడు పరుల కోసమే ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో ధన్య జీవులు చరిత్ర పుటల్లో... ఆ చరిత్ర పుటల్లో మనకు స్థానం కావాలనుకుంటే ముందు ఇంట్లో చక్కదిద్దుకోవాలి... మరొక సామెత గుర్తు వస్తోంది ఈ మాటకు ... " ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత " .. అన్నట్టు ఇంట్లో వాళ్ళను కనీసం తిన్నారా అని అడిగే సమయం ఉండదు కాని అక్కయ్యల్ని, బావయ్యల్ని, మామయ్యల్ని .... ఇలా ప్రతి ఒక్కరి క్షేమ సమాచారాలను అతి గౌరవంగా అడిగి తెలుసుకునే ప్రబుద్దులు ఈనాడు ఎందరో... మన అనుకున్న వాళ్ళను... మన ఉన్నతికి చేదోడైన వాళ్ళను పక్కన పెట్టి అన్యులను అందలాలు ఎక్కించే వాళ్ళను ఏ కోవలో చేర్చాలో... ఇంట్లో కనీసావసరాలు చూడలేరు కాని దీన జనోద్దరణకు బయలుదేరుతారు ఈ రాజారామ్మోహన రాయలు, కందుకూరి వీరేశలింగాలు... (మన్నించాలి పెద్దలు వారి  పేర్లు వాడినందుకు ).. ఇంట్లో పెళ్లాన్నో / అమ్మనో కనీసం తిన్నావా అని అడిగే సమయం లేని ఈ పెద్ద మనుష్యులు చెప్పే శ్రీరంగ నీతులు వినడానికే అసహ్యంగా అనిపిస్తాయి... అన్నట్టు ఈ శ్రీరంగ నీతులు అంటే గుర్తు వచ్చింది మరో విషయం... ఉదయకిరణ్ గుర్తు వస్తే వెంటనే నాకు గుర్తు వచ్చే వ్యక్తి మాజి మంత్రివర్యులు చిరంజీ గారు...
పరోపకారానికి నాడు చరిత్ర కెక్కి ఈనాటికి సజీవంగా మిగిలిపోయిన  శిభి చక్రవర్తి, కర్ణుడు వంటి మహానుభావులు కోకొల్లలు... కాని ఈనాడు చరిత్ర హినులే ఎక్కువగా చరిత్ర పుటల్లో మిగిలి పోతున్నారు.. ఎందుకీ వ్యత్యాసం నేస్తం... !!
అర్ధం కాని అయోమయంలో ...
నీ నెచ్చెలి

త్రిపదం....!!

1. మనసు మౌనమై 
మోము అరుణమయ్యింది
నీ జ్ఞాపకాలు తడిమి

2. వేకువ పొద్దులో
నీ జ్ఞాపకాల సవ్వడికి
తూరుపు అరుణిమ దాల్చుతోంది

3. సందె ఎరుపు ఎందుకో
సిగ్గుపడుతూ కెంపుల వర్ణాలతో
నీ బుగ్గల్లో సింధూరమయ్యింది



ఏక్ తారలు....!!

1. పెట్టిన గోరింట వెనుక_పండిన అనురాగం ఆత్మీయతకు ఆనవాలుగా
2. నీ ప్రేమకు సాక్ష్యమైన గోరింట_నా చేతిలో ముగ్ధంగా ముద్దమందారంలా
3. గోరింట చేతికి అలంకారమై_వేకువ సింధూరమై నీ ప్రేమకు కానుకగా
4.తారలు తళుక్కుమన్నాయి_చెలి నవ్వుల్లో మెరిసి
5. మాటలు మౌనాలయ్యాయి_నీ మనసు భావాన్ని చదివి
6. ఆకాశమంత ప్రేమను తెలుపుతూ_గుప్పెడంత గుండెను పరిచాయి
7. గువ్వలా ఒదిగిపోయా_మమతల గుండె గూటిలో
8. అనంత వాహిని గోదావరి_అలవికాని ప్రేమ పాయల నడుమ
9.  ఉగ్ర గోదావరికి వరదలు_ఉప్పెనంటి జ్ఞాపకాల గురుతులతో
10. ఆలోచనలు అల్లరివే_ఎందరిలో ఉన్నా ఏకాంతమీయక
11. త్రివేణి సంగమ స్థావరం_త్రిమూర్తులకు పూజలందింప

13, జులై 2015, సోమవారం

అంతర్ముఖంలో....!!

మూసుకున్న ఆ రెప్పల మాటున
ఒలుకుతున్న భావాల ఒరవడి
జారుతున్న కన్నీటికి సాక్ష్యం

మది మౌనానికి వేదికగా
రూపుదిద్దుకుంటున్న ఆక్షరాలు
చిలుకుతున్న సంకేతాలు

అంతర్యుద్దాన్ని అవలోకిస్తూ
ఋణ శేషాలను లెక్కలు వేస్తూ
బంధాల బాధ్యతల అంతర్నేత్రాలు

వెలుగులు వేసారి పోతూ
చీకటి సామ్రాజ్యానికి పట్టం కడితే
కొడిగడుతున్న దీపపు అవశేషాలు

అంతర్ముఖంలో ఆలోచిస్తూ
జీవన్మరణ యుద్దానికి సన్నద్దమైన
కాయపు అంతిమ ఘడియలు

అస్పష్టమైన ఆకృతుల
ఆనవాళ్ళలో చేరుతూ జన్మరాహిత్యంలో
ప్రేమ సాన్నిహిత్యానికై పరుగులు...!!

11, జులై 2015, శనివారం

అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో మరి...!!

నేస్తం,
         నీకొకటి తెలుసా... మన జీవితంలో మనం చూడలేనిది ఏమిటో... ఒక్క మనం తప్ప అందరు చూడగలరు అది.. ఈ ప్రపంచంతో బంధాలను వదిలించుకుని సాగే ప్రయాణం అదే అంతిమ యానం... ఘనంగా సాగనంపుతున్నారో... గతి లేనట్లుగా పంపేస్తున్నారో.. కూడా చూడలేనిది...  తిడుతున్నారో... పొగుడుతున్నారో వినలేనిది.. ఈ ఆఖరి ప్రయాణమొక్కటే... మనం వెళిపోయినా ఇక్కడే ఉన్న మన జ్ఞాపకాలు సజీవాలుగా ఉండి పోతాయి ఎప్పటికి మన అనుకున్న వాళ్ళకు... మనం మాత్రం వెళిపోతూ ఏమి తీసుకెళ్ళకుండానే ఊపిరిని కూడా వదిలేస్తాం... కనీసం మరణం తరువాత ఏమిటో కూడా తెలియకుండానే మరణానికి చుట్టాలమైపోతాం మన ప్రమేయం లేకుండానే...  అంతిమ ప్రయాణానికి అక్షరాలూ సహకరించలేమంటున్నాయి ఓడార్పుకు బాసటగా నిలుస్తూ... జీవితానికి చిట్ట చివరి మజిలీ మరణమని.... అప్పటి వరకు మనతో ఉన్నది ఏది మరణంలో మనతో రాదని తెలిసినా ఏదో తాపత్రయం బ్రతికినన్నాళ్ళు... అంతిమ ప్రయాణాన్ని చూడలేని మనకు అలవికాని కోరికలెన్నో.... కన్నీళ్ళ వీడ్కోలు చూడలేము... కదలిరాని బాంధవ్యాలను మనతో కాటికి రమ్మనలేము... అంతిమ ఘడియల్లో జీవాన్ని వదిలే జీవి అంతర్మధనాన్ని అర్ధం చేసుకునే భాష ఇంకా రాలేదేమో.. ఎన్నో మరణ ప్రయాణాలను చూసినా మనం చూడలేని మన అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో మరి...
మరణమంటూ లేని స్నేహాన్ని తోడుగా చేసుకున్న మన మధ్యలో దూరాన్ని పెంచే ఈ అంతిమ ఘడియలకు వీడ్కోలు పలకాలని కోరుకుంటూ ...
నీ స్నేహం ...

ఏక్ తారలు....!!

1. యుగాల జ్ఞాపకాలను అందిస్తూ_క్షణాల చెలిమికి సన్నిహితంగా
2. అంటు మహా వృక్షమైంది_నీ ఆలోచనల అంతరార్ధాన్ని తెలుసుకుని  
3. భావాల వర్షానికి_అక్షర హర్షం మాసాల వారిగా
4. నిజానికి చావు లేదు_అబద్దానిదే అల్పాయుష్షు
5. వెన్నెల దోసిళ్ళలో ఒదిగిపోయింది_గుప్పెడు గుండెలో తారలు చేరాక
6. ప్రేమ పాఠాలు వల్లె వేస్తోంది మనసు_పసిడి ప్రాయం చేరువయ్యాక
7. కల్మషమెరుగని ఆ ప్రేమ_కడవరకు అమ్మలో
8. మనిషికి మాత్రమే సాధ్యం_మారు రూపాల మాయాజాలం
9. పాశాల లతలు అల్లుతుంది_బంధాలకు ఆసరాగా
10. తలుపు తీసింది వెన్నెల_తలపుల తుషారాలు మదిని తడుపుతుంటే
11. గాలి గాంధర్వమైంది_మురిపించే మంచు ముత్యాల జ్ఞాపకాలకి
12. అస్మదీయులను తస్మదీయులను చేస్తుంది_అలవికాని ఆత్మీయ పాశం
13. పరీక్షలకు మహా ఇష్టం_మన బంధం గట్టిదనం చూడటం

ఆనవాళ్ళుగా మిగిలిపోతూ....!!

పుట్టుకతోనే జతగా వస్తూ
పక్కనే ఉంటూ చోద్యం చూస్తూ
ఒంటరితనానికి వారధివౌతూ
నైరాశ్యం చుట్టుముడితే
ఏదో పని ఉన్నట్టు హడావిడిగా
పద పదమంటూ రొద పెడుతూ
పాశాలకు అతీతమైన బంధాలు
పొద్దులో వాలిపోతూ రాలిపోతుంటే
పట్టి ఉంచాలన్న వృధా ప్రయత్నంలో
మిగిలేవి మనసు తొలిచే జ్ఞాపకాలే
కడ వరకు తోడుగా  సహవాసం చేస్తూ
మరుజన్మకు ఆనవాళ్ళుగా మిగిలిపోతూ....!!

ఏక్ తారలు....!!

1. నక్షత్రాల జ్ఞాపకాలతో అతుకులు వేస్తున్నా _స్వప్నాల సౌధంలో
2. పాదరసంలా పాకుతోంది అబద్దం_సత్యం చెలిమిని చిన్నబుచ్చుతూ
3. రంగుల కలల సాకారం_నీ అలికిడికి హరివిల్లుగా మారుతూ
4. నిజం నిర్భయానికి దాసోహం అయ్యింది_అల్పాయుష్షు  అబద్దం
5. హరివిల్లు అందాలు_అరుదెంచిన ఆ మధుర క్షణాలు
6. సత్యానికి గాయాలౌతునే ఉన్నాయి_అబద్దపు తూటాల యుద్దంలో
7. మమతలు ముచ్చటగా ఉన్నాయి_అరుదెంచిన క్షణాల రాకతో

10, జులై 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

1. తుషారం తూనీగలా ఎగురుతోంది_వేకువ తాకినందుకేమో
2. వన్నెల వెన్నెలలే ఎద వాకిట_మది నిండిన నీ ఊహల సందడిలో
3. చిరునవ్వులు సిగ్గుపడ్డాయి_ముడుచుకున్న మల్లెల ముగ్ధత్వాన్ని చూసి
4. మెదడు పదును మనసుని కోసేస్తోంది_నీ జ్ఞాపకాల భారాన్ని మోయలేక
5.  వెన్నెల వేసారింది_మల్లెలలో నీ మనసు వెలుగు ముందు చిన్నబోయి
6. నాటి నేటి వాస్తవాల జ్ఞాపకాలు_యుగాలకు సైతం సజీవాలే
7. నిన్నటి నీ పలుకులు వింటూ_రేపటిని మరిచిపోయింది నేటి నా వాస్తవం
8. మిన్నల్లో నే మిగిలిపోయా_వెన్నెలలు నువ్వెత్తుకెళ్ళాక
9. మనసు చూసిన కనులకు తెలిసింది_తన భావాలకు నీవే ఆలంబన అని
10. మిణుగురునై నీ వెంటే ఉన్నా_ఎదురుదెబ్బలు తగలనీయకుండా
11. ఈ ప్రేమ లెక్కలు ఎంతకీ తేలడం లేదు_మరు జన్మకు శేషంగా మిగిలిపోతూ
12. లెక్కలకు అందని భావనలే_నీతో చేరిన నా మనసు సందడులు
13. తుషారపు చినుకులు తబ్బిబ్బయ్యాయి_వేకువలో వెన్నెల వన్నెలు చూసి
14. ఆశయాల చక్రాలు ముదుకు సాగాయి_ఊహలలో వాస్తవాలను వెలికి తీస్తూ
15. అను 'రాగానికి' ఆశ్చర్యమే_ప్రభాతానికెందుకంత పరవశమా అని

8, జులై 2015, బుధవారం

రేపటిని వద్దంటూ....!!

వ్యాపకాల వ్యామోహం
మనసుపై చేసిన దాడిలో
గాయాలదే పై చేయిగా మారింది

విజయానికి చేరువగా రాని
ఊహల వాస్తవాలు వెక్కిరిస్తూ
అల్లంత దూరంలో నిలబడ్డాయి

మారాము చేసిన జ్ఞాపకాలు
మౌనాన్ని ఆశ్రయించి దిగులుగా
ఎద వాకిట్లో తల్లడిల్లుతున్నాయి

అల్లరి సంతకాల ఆటల ఛాయలు 
ఆటకలెక్కిన గతాలుగా మారి
భూతకాలానికే  పరిమితమై పోయాయి

ముగ్ధంగా మురిసే ముచ్చట్లు
మాటలు మరచి మూగ నోము పట్టి
గుండె గొంతును దాటి రాలేకున్నాయి

నీవు లేని క్షణాల నిజాన్ని జీర్ణించుకోలేక
మరలి రాని కాలాన్ని వెలివేసి నిన్నల్లోనే నిలిచిపోయి
రేపటిని వద్దంటూ మిగిలిపోయిన జీవితం....!!

5, జులై 2015, ఆదివారం

కడుపులో దాచుకుంది అమ్మలా....!!

అక్షరం ఏడుస్తోంది
మనసు భావాలకు రూపాన్ని చెక్కే
శిల్పి చేతిలో ఉలి తానైనందుకు

కలం సిరా నుండి ఒలికిన
ప్రతి గేయము గాయమై తాకుతుంటే
ప్రతి క్షణము ప్రసవ వేదనే

రెప్పల చాటున దాగిన
కన్నీటి చెలమల సాక్షిగా ఒప్పుకున్న నిజాలు
గునపాలై గుండెలను చీల్చుతుంటే

వెలుతురు చూడలేని
చీకటి జ్ఞాపకాలు చుట్టాలై చేరితే
తల్లడిల్లే మదిని సముదాయించలేక

అమ్మ భాష తెలిసిన
అక్షరాన్ని ఆశ్రయం కోరితే
స్వాంతన అందిస్తూ కడుపులో దాచుకుంది అమ్మలా....!!

రేపటి జ్ఞాపకంగా ....!!

నేస్తం,
         మనల్ని బాధించే జ్ఞాపకాలను మరచిపోగలిగితే ఎంత బావుండు... ఒకప్పుడు ఆత్మీయుల నడుమ సంతోషమైన జ్ఞాపకం అదే ఆత్మీయత కానరాని లోకాలకేగినప్పుడు... మరచి పోగలిగే జ్ఞాపకం కాగలిగితే కన్నీటికి చోటు దక్కదని ఒకింత జాలితో మరచిపోలేనివే జ్ఞాపకాలుగా మనలో దాగుండి పోతున్నాయేమో.. జనన మరణాలు సృష్టిలో ప్రతి జీవికి తప్పవని తెలిసినా ఎందుకో కొన్ని ఆత్మీయతలు మనలను వెన్నాడుతూనే ఉంటాయి ఎప్పుడు... శిధిలాలలో దాగిన శిల్పాల జ్ఞాపకాలు సజీవమైనట్లే మనుష్యులు లేకున్నా కొన్ని జ్ఞాపకాలు సజీవమై మనతోనే ఉంటాయి.. ఆత్మీయతానుబంధం లేని కొందరు దురదృష్టవంతులకు మాత్రం జ్ఞాపకాలే ఉండవు... అది వారి దురదృష్టం అని వారు అనుకోరు.. ఆ జీవితమే అత్యంత ఆనందకర జీవితం అనుకుంటారు... కొందరేమో జ్ఞాపకాలను వదిలేసి బతికేయాలనుకుంటారు కాని అనునిత్యం అవి వారిని వెన్నాడుతూనే ఉంటాయి... కొందరికేమో పదిలంగా మదిలో చేరి తోడుగా ఉంటూ ఆనందాన్నిస్తాయి... నిన్నటి వాస్తవాలు రేపటి జ్ఞాపకాలు కాగలిగితే ... మన జ్ఞాపకాల్లో కొందరున్నట్లే మనము కొందరికి జ్ఞాపకంగా  ఉంటామో లేదో మరి ... ఏమిటో ఎంత వద్దనుకున్నా మనసు పరి భ్రమణం జ్ఞాపకాల చుట్టూనే... ఆత్మీయులు దూరమైతే కన్నీటి జ్ఞాపకం... అనుబంధం దగ్గరైతే ఆనంద జ్ఞాపకం ... ఇలా జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒక జ్ఞాపకం మనతోనే... నీతో ఇలా పంచుకోవటము రేపటికి ఓ జ్ఞాపకమే...
నిన్నటి నీ వాస్తవమైన నేను రేపటి జ్ఞాపకంగా .... !!

2, జులై 2015, గురువారం

యుగాల వాస్తవంగా....!!

నేస్తం,
          భావాలకు పాతదనం లేదని ఎప్పటికి కొత్తగానే ఉంటాయని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నా ఎందుకో మళ్ళి కొత్తగానే అనిపిస్తోంది... ఎప్పటిదో జ్ఞాపకం ఇప్పటికి పలకరిస్తూనే ఉంది నన్ను... నీతో చేరినందుకేమో ఆ జ్ఞాపకానికంత జీవకళ ఇప్పటికి... నన్ను వదలలేని నీ జ్ఞాపకాలన్నీ నాతోనే ఉండి పోయాయి నీకు లేకుండా... అందుకేనేమో జ్ఞాపకాన్ని మర్చిపోయావు గతానికి వదిలేస్తూ... మాటలు మర్చిపోయిన గతాన్ని జ్ఞాపకాల వాస్తవంలో చూడాలని నీకెప్పుడు అనిపించలేదా... క్షణాల కాలంలో యుగాల నిరీక్షణలా ఎదురుచూస్తూనే ఉండి పోయింది నా జ్ఞాపకం నీ ఎద వాకిలిలో రెప్పల మాటున దాగుండి పోయి... నా చుట్టూ ఉన్న జ్ఞాపకాల పహారాలో సేద దీరిన మది తలపులు తెరచి చూస్తే ... హద్దులు లేని ఆకాశంలో లెక్కకు రాని వేల చుక్కల్లో రాలిపడిన ఒంటరి నక్షత్రాల లెక్క తేలనట్లే ఈ జ్ఞాపకాల లెక్కలు తేలడంలేదు ఎన్ని సార్లు లెక్కించినా... లెక్కలు తేలడం లేదని కోపం నటిస్తున్నాయి జ్ఞాపకాలు... తేలని  లెక్కల్లో ఎప్పుడు నీతోనే ఉండొచ్చని తెలిసి కూడా ... జాలి లేని కాలం గతాన్ని వెనుకకు నెట్టేసి నువ్వు లేని వాస్తవాన్ని నాకు దగ్గరగా తేవాలని తహ తహలాడుతోంది... కాలానికి అర్ధం కావడం లేదు.. నువ్వు లేని వాస్తవాన్ని నేనెప్పుడో త్యజించానని... గతమైన జ్ఞాపకమే నా నేస్తం ఎప్పటికీ అని... అక్షరాలకు తెలిసింది కాని నాతోనే ఉన్న నీకు తెలియడం లేదు... నీ గతంలోని వాస్తవాన్ని నేనే అని... ఇప్పటికయినా తెలిసిందా నేస్తం ఎవరికెవరో... క్షణాల నీ జ్ఞాపకంగా మారడానికి యుగాల వాస్తవంగా వేచి ఉండటానికి సిద్దం....!!
ఎప్పటికి నీకు లేని జ్ఞాపకం...

1, జులై 2015, బుధవారం

ఏక్ తారలు.....!!

1. అనుభూతులను ఆస్వాదిస్తున్నా_భావాలను పేర్చిన అక్షరాలతో సహా 
2. అబద్దానిదే రాజ్యం_నిజాన్ని కప్పేస్తూ
3. చల్లని స్నేహానికి సేద దీరుతూ_నిందల వేడిని నీరు గారుస్తూ
4. జ్ఞాపకాలు తారాడుతున్నాయి_నీ వెంట పడుతూ
5. మనసు చచ్చిపోయింది_దిగజారిన మానవతా విలువలను చూస్తూ
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner