15, జులై 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. వలచిన మనసు చూడదు_తల(లు)పుల అనుమతి కోసం
2. శ్రావణం ఎదురు చూస్తోంది_ఆషాడాన్ని ఎప్పుడు తరిమేద్దామా అని
3. నవరసాలు వెల్లువెత్తాయి_మధుర కావ్యానికి మోకరిల్లుతూ
4. పుష్కరాల సంబరానికై_హరివిల్లును అరువడిగిందేమో గోదారమ్మ
5. గోదారి పుష్కరాలట_ఆసనాలు వలస వెళ్ళినట్లున్నాయి
6. అంబరం హారతి పడుతోంది_పుడమి ఒడిలో సీతమ్మ జననానికి
7. గాలికి వాటమెక్కువ_అందుకే ఆశలు గాలి వాటుకి పయనమయ్యాయి
8. సమయానుకూల స్పందనే_వేవేల వర్ణాల భావావిష్కరను అక్షరాలకద్దుతూ
9. మోసపోయిన నమ్మకాలకు_పుష్కరాల్లో తర్పణాలు వదిలేద్దామని
10. గోదాట్లో గల్లంతైన ప్రాణాలు_బ్రతుకు బాటను ఖాళీ చేస్తూ
11. శోక సంద్రంలో నిండుగా గోదారి_ఆప్తుల ఆనవాళ్ళను మోసుకెళ్తూ
12. స్వప్న విహారానికి సమయమయ్యిందట_రేయమ్మ ఆగలేనంటోంది
13. సకల కళా పారంగతులే పండితులు_రవి కాంచని చోటును కవి కాంచుతూ
14. శతావధానమే_ చెలి కన్నుల్లో కాశ్మీరాలను చూడబోతే
15. మది దోచిన మనస్విని తలపుల్లో చేరి_మలయ మారుతమే దరి చేరింది
16. పిలువని పేరంటం అవుతుందేమోనని _ఆత్మీయత మది వాకిట వేచి ఉంది
17. వరాల జల్లులో తడిసి ముద్దయ్యాడు_మగువ మనసు గెలిచిన ధీరుడు
18. మధుర జ్ఞాపకాల మధుర తల్పమే_గెలుపు అనుభూతిలో ధీర జంటకు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner