26, జులై 2015, ఆదివారం

నీకు తెలుసు....!!

కాలే కడుపుకి తెలుసు
ఆకలి ఎలా ఉంటుందో  

రగులుతున్న గుండెకు తెలుసు
గాయాల బాధ ఏమిటో

నిశబ్దానికి మాత్రమే తెలుసు
ఏకాంతంలో మాటలు వినడమెలానో

మౌనానికి తెలుసు
ముత్యాల సరాలు ఎలా ఉంటాయో

అనుబంధానికి తెలుసు
ఆత్మీయత ఏమిటో

సంద్రానికి తెలుసు
అలల సవ్వడిలో కథల హోరు

కోపానికి తెలుసు
మది సంతోషం ఏమిటో

పాశానికి తెలుసు
మమకారం ఎలా ఉంటుందో

జ్ఞాపకాలకు తెలుసు
ఘనమైన గతం ఎలా ఉంటుందో

జీవితానికి తెలుసు
జీవం లేని చిరునవ్వు ఎలా ఉంటుందో

నీకు తెలుసు
నువ్వు లేని నేను ఎలా ఉంటానో....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner