10, జులై 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

1. తుషారం తూనీగలా ఎగురుతోంది_వేకువ తాకినందుకేమో
2. వన్నెల వెన్నెలలే ఎద వాకిట_మది నిండిన నీ ఊహల సందడిలో
3. చిరునవ్వులు సిగ్గుపడ్డాయి_ముడుచుకున్న మల్లెల ముగ్ధత్వాన్ని చూసి
4. మెదడు పదును మనసుని కోసేస్తోంది_నీ జ్ఞాపకాల భారాన్ని మోయలేక
5.  వెన్నెల వేసారింది_మల్లెలలో నీ మనసు వెలుగు ముందు చిన్నబోయి
6. నాటి నేటి వాస్తవాల జ్ఞాపకాలు_యుగాలకు సైతం సజీవాలే
7. నిన్నటి నీ పలుకులు వింటూ_రేపటిని మరిచిపోయింది నేటి నా వాస్తవం
8. మిన్నల్లో నే మిగిలిపోయా_వెన్నెలలు నువ్వెత్తుకెళ్ళాక
9. మనసు చూసిన కనులకు తెలిసింది_తన భావాలకు నీవే ఆలంబన అని
10. మిణుగురునై నీ వెంటే ఉన్నా_ఎదురుదెబ్బలు తగలనీయకుండా
11. ఈ ప్రేమ లెక్కలు ఎంతకీ తేలడం లేదు_మరు జన్మకు శేషంగా మిగిలిపోతూ
12. లెక్కలకు అందని భావనలే_నీతో చేరిన నా మనసు సందడులు
13. తుషారపు చినుకులు తబ్బిబ్బయ్యాయి_వేకువలో వెన్నెల వన్నెలు చూసి
14. ఆశయాల చక్రాలు ముదుకు సాగాయి_ఊహలలో వాస్తవాలను వెలికి తీస్తూ
15. అను 'రాగానికి' ఆశ్చర్యమే_ప్రభాతానికెందుకంత పరవశమా అని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner