15, అక్టోబర్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. రాజీ పడిపోయింది రాజ్యాంగం_అధికారం చేతుల్లో నలిగి
2. వాసంతం పక్కనే ఉంటే_నువ్వు నాతోనే ఉన్నావని సంబరపడుతున్నా
3. నీ జ్ఞాపకాలలో బందీనై_జీవితమే తెలియలేదు 
4. నిదురెక్కడ నాకు_కలలోనూ నువ్వేనాయే
5. ఊటబావి మన జ్ఞాపకాల గతం_నీకు తెలియంది కాదుగా
6. సముద్రాల 'సు'దూరాన్ని_కలిపెను మూడుముళ్ల బంధం

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

చక్కని సామాజిక వాస్తవం
"రాజీ పడి రాజ్యాంగం_అధికారులు దళారుల చేతుల్లో బ్రష్టుపడి" .... అనదం లో
సున్నిత మనోభావన
"వాసంతం పక్కనే ఉంటే_నువ్వు నాతోనే ఉన్నావని సంబరపడుతున్నా" .... అనదం లో
యూగాలు క్షణాలైన మధురానుభవన జీవితం
"నీ జ్ఞాపకాలలో బందీనై_జీవితమే తెలియలేదు" .... అనడం లో
ఎప్పుడూ తలపుల్లో తచ్చాడే కన్నయ్యపై అనురాగం అక్షరాల్లో
"నిదురెక్కడ నాకు_కలలోనూ నువ్వేనాయే" .... అనడం లో
జ్ఞాపకాల భావనల లోతు కనిపిస్తుంది .... కవయిత్రి గారి స్పర్శలో
"ఊటబావి మన జ్ఞాపకాల గతం_నీకు తెలియంది కాదుగా" .... అనడం లో
బహుశ జన్మజన్మల బంధం కదా మరి
"సముద్రాల 'సు'దూరాన్ని_కలిపెను మూడుముళ్ల బంధం" .... మంజు గారు
అభినందనలు అందమైన తారల కు

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavadalu chandra garu chakkani mi vivaranaku _/\_

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner