6, అక్టోబర్ 2015, మంగళవారం

ఏక్ తారలు...!!

1. అక్షరాల ఆహార్యం అలాంటిది_అలుకలు కినుకులు అన్ని బలాదూరే
2. అన్ని మరచి అక్షరాలూ_నీతోనే ఉండి పోయాయి అందుకేనేమో
3. అక్షర చెలిమికి విలువ కట్టగలమా_వేల జన్మలు ఎత్తినా
4. పల్లవై పరిమళ రాగం ఆలపిస్తోంది_అక్షర చెలిమికి దాసోహమై
5. అన్నం పరబ్రహ్మ స్వరూపం_వాణీ నిలయం ఏక్ తారా సమూహం
6. ఓటమిలో విజయం_ఒక్క అక్షరానికే సాధ్యం
7. ఆద్యంతమూ మిగిలిపోయేది_అక్షర జన్మమే
8. నీ మనసు తీయదనంతో_బతుకు పయనంలో మనిద్దరమై

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

అక్షరాల సౌలభ్యం అలాంటిది_అలుకలైనా కినుకులైనా ఆవిరైపోతూ
అలుకలు కినుకులూ ఎరుగని అక్షరాలు_నీతోనే ఉండి పోయాయి అందుకేనేమో
అక్షరాలకూ చెలిమికీ విలువ కట్టగలమా_వారధెయ్యగలమా జన్మలెన్ని ఎత్తినా
పల్లవై పరిమళ రాగం ఆలపించాలనుంది_అక్షరాలకూ చెలిమికీ దాసోహమై
అన్నం పరబ్రహ్మ స్వరూపం_వాణీ నిలయం ఏక్ తారల సమూహం
ఓటమిలోనూ విజయం_ఒక్క అక్షరాయుధానికే సాధ్యం
ఆద్యంతమూ మిగిలిపోయేది_అక్షర జన్మ శిలాక్షర బంధమే
మనసు తీయదనం అక్షరాలతో_బతుకు పయనంలో మనోల్లాసం

ప్రతి తార లోనూ ఆకాశమంత ఔన్నత్యం
అందమైన భావనలకు అభినందనలు మంజు యనమదల గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavaadalu chandra garu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner