1, డిసెంబర్ 2015, మంగళవారం

దాటేయాలని ప్రయత్నిస్తున్నా...!!

అంపకాల పంపకాలు
నిన్నో మొన్నో అయినట్లున్నా
పారాణి అడుగుల ఆనవాళ్ళు 
అక్కడక్కడా ఎండి కనబడుతున్నా
పచ్చని తాటాకు పందిరి
కాస్త వడబడి రంగు తగ్గినట్టున్నా 
పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు
ఎక్కడివాళ్ళక్కడ సర్దుకుంటున్నా
గుండె గదిని ఖాళి చేయని
నీ జ్ఞాపకాల గుభాలింపులన్ని తరుముతూనే ఉన్నా
వాస్తవాలను వాయిదా వేయలేని
మనసుపై గీసిన అసంపూర్ణ చిత్రంగా మిగిలున్నా
మదిపై  రాసిన మరణ శాసనాన్ని
వదలలేని గతాన్ని దాటేయాలని ప్రయత్నిస్తునే ఉన్నా...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు సర్దుకున్నా ఇంకా గుండె గదిని ఖాళి చేయని
ఏ జ్ఞాపకాల గుభాలింపుల్లోనో
అసంపూర్ణ అసంతులన చిత్రాన్నై గతాన్ని దాటెయ్యాలనే ప్రయత్నంలో
చాలా బాగా రాసారు మంజు గారు!
అభినందనలు.

Pachipulusu venkata subbarao చెప్పారు...

It 100% real; every person have this feeling in his life.

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavadalu chandra garu subbarao garu

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner