25, అక్టోబర్ 2016, మంగళవారం

నేలరాలిన రాచిలుక...!!

పలకరించని పిలుపులు చేరువలో 
కలవరింతలు కలలుగా మదిలో
గాయపడిన గుండె జ్ఞాపకాలలో
చెమరింతల చేవ్రాలుల ఓదార్పులలో
కలతపడే కన్నుల కబుర్లలో
ఊసులకందని ఉహల రెక్కలలో
నింగికెగిరే చుక్కల పయనంలో
ఆశల హార్మ్యాలను అందుకునే యత్నంలో
బంధనాలకు తల ఒగ్గి నేలరాలిన రాచిలుక...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

వేగంగా గమ్యం చేరాలను ఆరాటం లో బంధనాలను త్రెంచుకోలేక నేలరాలిన రాచిలుక .... అను
చక్కని అభివర్ణన
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

dhanyavaadaalu andi chandra garu

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner