4, నవంబర్ 2016, శుక్రవారం

ఈ కన్నీళ్ళు...!!

దాయాలంటే దాగవులే  ఈ కన్నీళ్ళు
మనసుతో జతపడి ఉన్నవిలే ఈ కన్నీళ్ళు 

గతపు గాయాల ఆనవాళ్ళుగా
మమతలతో ముడి పడి ఉన్నవి ఈ కన్నీళ్ళు

కలతల కలలకు నెలవులుగా
చెలిమిని పంచుతున్నవి ఈ కన్నీళ్ళు

చెదరని గురుతుల సాక్ష్యంగా
జ్ఞాపకాల మధువులను గ్రోలమన్నవి ఈ కన్నీళ్ళు

రెప్పల మాటున దాగిన మౌనమై నిలిచినా 
గుప్పెడు గుండెకు మాటలు నేర్పును ఈ కన్నీళ్ళు

ఆనంద విషాదాలకు ఆలవాలమై
మదిని ఊరడించును ఈ కన్నీళ్ళు

మధుర భాష్యాల మృదు మంజుల స్వగతాలుగా
అక్షరాలై జాలువారుతున్నవి ఈ కన్నీళ్ళు...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner