1, డిసెంబర్ 2016, గురువారం

మేము దేశ భక్తులం కాదు కదా..!!

మొత్తానికి మన దేశ భక్తులకు మరో విషయం ఈపాటికి తేటతెల్లమై ఉంటుంది కదా. నల్ల ధనంపై యుద్దమని చెప్పి నోట్ల రద్దుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ బాబుల అప్పులు రద్దు చేశారు. పంటలు నష్టపోయిన రైతుల ఋణాలు మాత్రం వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. నోరు కట్టుకుని కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సొమ్ముకి కన్నాలు వేశారు తెలివిగా. మరి ఎంత నల్ల ధనం చేరిందో అని మనం అడిగితే ఆ లెక్కలు మళ్ళి ఎన్నికల తరువాత చెప్తాము అంటూ స్టేట్మెంట్ ఇస్తారేమో. మన రూపాయికి దొంగ నోట్లు వస్తున్నాయి, మరి డాలర్ కి నకిలీ రాకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్త మనం ఎందుకు చేయలేక పోతున్నాం. దేశాలు జనం సొమ్ముతో తిరగడం కాదు, కొద్దిగా అయినా సామాన్యులకు న్యాయం చేయాలి. చిల్లర కష్టాలు సామాన్యులకు షరా మామూలే. మళ్ళి కొత్తగా ఈరోజు నల్ల బంగారంపై వేటు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనీసం ఒక్కరికైనా వేరే ఆలోచన రావడం లేదా. మనం ఎంతో గొప్పగా భారత దేశం పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది అని ఎదురు చూస్తున్నాం. దొంగనోట్లు అరికట్టడానికి ఉన్న నోట్లు రద్దు చేశారు. కాలం నుంచి ఉన్న బంగారానికి లెక్కలు చూపమని అడగడానికి మరి ఏ సాకులు చెప్పి జనాన్ని నమ్మిస్తారో. సామాన్యులు కూడబెట్టుకునే సొమ్ముకు లెక్కలు అడగడం మానేసి నాయకుల ఖజానాలు నింపుకునే మార్గాలు బానే అన్వేషిస్తున్నారు రాజకీయ చాణుక్యులు. జనాలను వాళ్ళు చేసే మోసాల నుంచి దారి మళ్ళించడానికి ఈ రద్దు సూత్రాలు రుద్దుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే మేము దేశ భక్తులం కాదు కదా -:)

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner