3, ఏప్రిల్ 2017, సోమవారం

ఏక్ తారలు...!!


1.  తారలు తారాపథంలో తారాడుతున్నాయి_కవి హృదయ సిరా నుంచి వెలువడాలని
2. అలుకలకు తావెక్కడ_ఉగాది సంబరాలలో అందాల తారలు కొలువు దీరిన వేళ
3.పొలమరింతలు పలవరింతలుగా_పదే పదే పలకరిస్తున్నాయి తారల వన్నెలు
4. వసంతుడు వలపు పంచాడట_వెన్నెల వాసంతపు సమీరాలకు
5. అవని ఆత్మీయంగా అల్లుకుంటోంది_అక్షరాలా పొదరింటిలోని భావాలను
6. కలలు కల్లలు కాలేదు_వాస్తవాలు తారల్లో అగుపడుతుంటే
7. రోదనలోనూ శోధనే_మరో గెలుపుకు బాసటగా
8. గుప్పెడు గుండె మోయలేని భారం_అక్షరాలా అండతో అలుపుదీరింది
9. ప్రజ్ఞ మెరిసింది_ప్రతిభావంతమైన గుర్తింపుతో
10. అమ్మే ఆలంబన_ ఆది అంతాలకు మూలమౌతూ
11. పసిప్రాయం పరిమళించింది_ఆసరా ఇచ్చిన గురువు పేరు నిలబెడుతూ
12.యుగాలన్ని క్షణాలే_నీ సాంగత్యంలో
13. మాటల ముసురులోముంచేసావుగా_ఇక వేరే పంజరమెందుకు
14.కవి కలంలో నుంచి జాలువారే క్షణాల కోసం ఎదురుచూస్తూ_తారల నిరీక్షణ 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner