22, జూన్ 2018, శుక్రవారం

మానసిక వైకల్యం..!!

విధాత రాసిన రాతలో
అవయవాల అమరిక 
మరచినందుకేమో 
పుడుతూనే అయినవాళ్ళ 
ఛీత్కరింపులను, తిరస్కారాలను 
వెంటేసుకుని కొన్ని జీవితాలు 
మొదలవుతాయనుకుంటా 
ఆశ చావని బతుకులో 
తోడుగా దొరికిన బంధం 
అర్ధాంతరంగా వదలి వేసినా 
జీవం పోసిన జీవితాలను
కన్నపేగు మమకారాన్ని
నడిరోడ్డున పారేయలేక
బతక లేక, చావలేక
కష్టాలు కన్నీళ్ల స్నేహంతో
ధిక్కారాలను, దిగుళ్ళను
సోపానాలుగా చేసుకుంటూ
తన వంతు బాధ్యతలు నెరవేర్చుతూ
అవహేళనలను, అపహాస్యాలను
పునాదులుగా మార్చుకుంటూ
శరీరం కదలలేని స్థితిలో సైతం
మానసిక ధైర్యాన్ని కోల్పోని
ఆచేతనావస్థల చేతనం ముందు
అన్ని సక్రమంగా ఉండి
బంధాలను భారమని
గాలికి వదిలేసి తమ స్వార్ధం చూసుకునే
మానసిక వికలాంగులు ఎందరో..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner