11, జులై 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.  ఉదయపు అంతరంగమే_రాతిరి కలల్లో నిక్షిప్తమౌతూ...!!

2.   భావాలకు దృడత్వమెక్కువే_వేదనలకు చరమగీతాలు పలకడానికి...!!

3.   మనుష్యులకే రాహిత్యమనుకున్నా_రాతలక్కూడా అని తెలియకముందు..!!

4.   భాషతో పనిలేదు_శోకాన్ని శ్లోకంగా మలిచిన పుణ్యభూమిలో..!!

5.   నిజాయితి నెమ్మదిగానే ఉంటుంది_అబద్ధానికి గొంతెక్కువైనా...!!

6.   భాష్యమై మిగిలిపోతున్నా_అక్షరాల ఆంతర్యాన్నందిస్తూ..!!

7.   తీసుకోవడానికేముంది కొత్తగా_స్వప్నమై చేరువగా నువ్వుంటే..!!

8.   కొలిమి కాలుతూనే ఉంది_సమ్మెట దెబ్బలతో వంకర్లు సరి చేయడానికి...!!

9.   అనునయించేది ఆ అక్షరాలే_మనసుల మాలిన్యాలను కడిగేస్తూ...!!

10.    క్షణాలకెంత స్వార్థమెా_చిటికెలో తనను మాయం చేస్తూ...!!

11.  అపహాస్యపు బతుకులే అవి_అక్షరం విలువెరగక..!!

12.   ఎద ఏకాంతమంతే_జ్ఞాపకాలతో గలాటాలాడేస్తూ...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner