ఆకాశాన్ని తాకినట్లనిపిస్తూ
ఆశలకు ఊపిరి పోస్తూ
నిరాశలను పారద్రోలుతూ
విరాగులకు విశ్రాంతి నిలయాలౌతూ
పట్టుదలకు పెట్టని గోడగా
దూరానున్న కొండలయినా
దగ్గరనే ఉన్న అనుభూతినిస్తూ
ఎత్తుపల్లాల జీవితాలను గుర్తుజేస్తూ
ఎదుట పడలేని నగ్న సత్యాలను ఎదలకందజేస్తూ
కనిపించే దూరపు కొండలెప్పుడూ నునుపే మరి....!!
నా అక్షరాలకు గౌరవాన్నిచ్చిన మన తెలుగు మన సంస్కృతికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు నా అక్షరాలకు విలువ, వన్నె తగ్గకుండా నన్ను హెచ్చరించే నాకున్న కొద్దిమంది ఆత్మీయు మిత్రులలో త్రినాధ్ గారు ఒకరు. నా సాహితీ ప్రయాణంలో లోటుపాట్లు చెప్పే మంచి మిత్రులు. త్రినాధ్ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు.