12, ఏప్రిల్ 2010, సోమవారం

ఉద్యోగుల వలసలు అరికట్టడం ఎలా?

ఒక సంస్థ నుంచి ఉద్యోగులు అధిక సంఖ్య లో వలసలు వెళ్లి పోతున్నారు అంటే దానికి కారణం ఎవరు? ఉద్యోగులా? లేక వున్నతాధికారులా? ఒక్క క్షణం ఆలోచించండి!! ఇంతకు ముందు ఎంతో బాగున్న సంబంధాలు ఒక్క సారిగా ఎందుకు పాడయ్యాయి? "ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మద్య దూరం పెరగటమే ముఖ్య కారణం. ఉన్నతాధికారులు చాలా పరిమితం గా ముగ్గురు లేదా నలుగురికి మాత్రమే అందుబాటులో వుండటం కుడా ఒక కారణం కావచ్చు. ఆ ముగ్గురు నలుగురు సంస్థలో జరుగుతున్న విషయాలను పై అధికారులకు ఎలా చెప్తున్నారు అన్న దాని మీద ఆధారపడి వుంటుంది. ఒక సంస్థ అభివృద్ధి చెందాలన్నా అధఃపాతాళానికి పోవాలన్నా సంస్థ ఉద్యోగులకు, పైఅధికారులకు మద్యన వున్న సంబంధ బాంధవ్యాలు చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఇవి బాగున్న ఏ సంస్థ అయినా అభివృద్ధి పధం లో ముందుకు దూసుకు వెళుతుంది. డబ్బుతో పాటుగా, విలువలకు కుడా కొద్దిగా ప్రాధాన్యత ఇస్తే ఒకింత మెరుగ్గా ఉంటుందని అనిపిస్తోంది. .

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner