5, మే 2010, బుధవారం

కధ కాని కధ - పార్ట్ 2

ఉపోద్ఘాతం...ఇంతకుముందు చెప్పాను కదా ముచ్చటైన కుటుంబం గురించి...దానికి కొద్దిగా ...
పిల్లలు చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ చదువుల కోసం కాకుండా చెల్లెలి పిల్లల చదువుల కోసం వేరే ఊరిలో పెద్దావిడ వుండి అందరిని చదివించారు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాలేక పిల్లలు రోజు వెళ్లి వచ్చే వారు. తరువాత పొలాలు అమ్ముకుని అందరికి దూరంగా వేరే వూరు వెళ్ళిపోయారు. అల్లుడు ఒక స్నేహితుడిని నమ్మి వాళ్ళ పొలాలు కొని మొత్తం డబ్బులు ఇచ్చి వ్యవసాయం చేసారు. కొన్ని రోజులు పాడిపంటలతో ఆ ఇల్లు కళకళలాడింది. పిల్లలు పై చదువులకు వచ్చేసరికి అంతా ఐపోయి బాగా ఇబ్బందులు పడ్డారు. పొలం అమ్ముదామంటే డబ్బులయితే ఇచ్చారు కాని సాక్ష్యం లేదు, ఆ స్నేహితుడి స్థితి బాలేనప్పుడు వీళ్ళు వీళ్ళ పంట అమ్మి తనకు సాయం చేసారు, చదువుకునేటప్పుడు కుడా చాలా ఆదుకున్నారు. కాని ఆ స్నేహితుడు స్వార్ధంతో చేసిన సాయాన్ని మరచి ఒక్క పైసా కుడా ఇవ్వలేదు...కట్టుబట్టలతో మళ్ళి సొంత ఊరికి వచ్చారు. ఇల్లు మాత్రమే వుంది ఏదో కొద్ది డబ్బులతో కొద్దిగా పొలం కొని రొయ్యల చెరువులు వేసారు. పూర్వం రొయ్యల వ్యాపారం కుడా చేసేవారు మళ్ళి స్నేహితులతో కలిసి ఆ వ్యాపారం మొదలు పెట్టారు. మెల్లగా కాస్త సంపాదించుకుంటున్నారులే అనేసరికి ఈ స్నేహితులలో కుడా ఈర్ష్య కలిగి వీళ్ళ దగ్గర వ్యాపారంలో డబ్బులు లేక బంగారం పెడితే అది తీసుకున్నారు. వేరేగా వ్యాపారం చేస్తే కంపెనీ వాడు డబ్బులు ఎగ్గొడితే వున్న పొలాలు అన్ని అమ్మి మళ్ళి మనష్యులు మాత్రమే నిలబడ్డారు. ఇలా మూడు నాలుగూ సార్లు మోసపోయారు. బతుకు పోరాటంలో ఇవి అన్ని తప్పవు అనుకుని మళ్ళి రొయ్యల చెరువు కౌలుకి వేసి అలా అలా కొద్ది కొద్దిగా సంపాదించారు. పిల్లలు చదువులు బానే చదివారు. చెప్తువుంటే ఇంతేగా అనిపిస్తుంది కాని ఇన్ని ఒడిదుడుకులను తట్టుకోవడం ఆ వుమ్మడి కుటుంబానికి సాధ్యమైంది. కష్టంలో ఎవరు నీ దరి చేరరు కాని నీ దగ్గర డబ్బులు వుంటే నీ చుట్టూనే వుంటారు ఈ విష్యం అందరికి తెలుసు.
మిగతా కధ మళ్ళి చెప్తాను...అంతవరకూ....

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

వీలయితే, ఇంకొంచం వివరంగా ఓ కథ లాగా మొదటినుండో, లేక ఈ కథలో ఓ పాత్ర వివరిస్తున్నట్లో వ్రాయండి.
ఇలా నిత్య జీవితంలో, అన్నిటికంటే కష్టాలు వచ్చినా, పేదరికం కమ్ముకొన్నా, పూలు అమ్మిన చోటే కట్టెలుకొట్టినా, సినెమా హీరోలు, హీరోయిన్లకంటే వందరెట్ల ఆత్మస్థైర్యంతో, జీవితాన్ని ఎదుర్కొన్న వాళ్లు, ఆ కుటుంబాలు చాలానే ఉన్నా, ఆ కథలకు, అందులోని ప్రధాన పాత్రలకు, ఆ కుటుంబాలకు అక్షర రూపం ఇచ్చినవాళ్లు తక్కువ.

అందుకని, మీరు వీలయినంత సమయం తీసుకొని ఓ నవల వ్రాస్తున్నట్లు, వివరం గా వ్రాయండి, ఈ inspiration తో మరింత మంది వారి వారి కుటుంబాలు ఎలా కష్టాలనుండి కష్టపడి ఎలా పైకి వచ్చాయో వ్రాస్తారెమో, అవి ముందు తరాలవాళ్లకు ఆదర్శప్రాయం అవుతాయి, అంతకంటే నమ్మినవాళ్లు మోసం చేసినప్పుడో, విపత్కరపరిస్తితులు చుట్టిముట్టినప్పుడు ఇలాంటి కథ కాని కథలే ధైర్యాన్ని ఇస్తాయి.

p.s. మా కుటుంబం ఇలాంటి పరిస్థితులలోనుండే పైకి వచ్చిందే, నమ్మిన బంధువులు, స్నేహితులు అందరూ ముంచినవాళ్లే!! ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మేమేనా అన్ని అడ్డకులను దాటుకొని ఈ పొజిషనుకు వచ్చింది అని మాకే ఆశ్చర్యం వేస్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

idi modalu matramenandi meru cheppinatle raddamani naa prayatnam adi entavaraku avutundo chudaali raayadaaniki naku raavaali gaa.try chestunnanu...thank you very much mee amulyamaina salahaaki...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner