23, నవంబర్ 2010, మంగళవారం

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు....

ఇళయరాజా గారు స్వరపరచిన పాపా లాలి చిత్రంలోని ఓ చక్కటి పాట ఇది. బాలు గారి గాన మాధుర్యానికి మాత్రమే కాకుండా వారి అసమాన ప్రతిభకు తార్కాణం ఈ పాట..పల్లవి, చరణాలు ఆపకుండా పాడటం ఈ పాట ప్రత్యేకత. మీరు వినండి చూడండి. లింక్ మీకోసం ఇక్కడ......
http://www.oonly.com/video/ASh2neJpH_M/Maate_Raani_Chinnadani

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !!

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

చాల బాగుందడీ ఈ పాట మీ వర్ణన కూడ.

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు బాగా ఇష్టమైన పాట ఇది అశోక్...వర్ణన అంటారా నాకు అంత బాగా రాదు చెప్పడానికి...అయినా థాంక్ యు అండి

Manjusha kotamraju చెప్పారు...

manchi paata gurtuchesaru,,thanx

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు సంతోషం మంజు గారు

Unknown చెప్పారు...

naku chala istamaina song andi..gutru chesnanduku thanks...............manju garu

చెప్పాలంటే...... చెప్పారు...

అవునా!! చాలా సంతోషం భువనా!!

Time చెప్పారు...

naku nachina pattalo idhi okati......i owe to illayraja n balu

చెప్పాలంటే...... చెప్పారు...

అవును ముక్తేష్ గారు చాలా మంచి పాట ఇది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner