16, నవంబర్ 2010, మంగళవారం

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు

అంకురం లోని ఈ ఆణిముత్యం లాంటి పాటలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత స్పూర్తిని, ఓ క్షణం ఐనా సమాజం గురించి ఆలోచించేటట్లు చేసే ఈ పాట చాలా చాలా ఇష్టం. ఈ సినిమా కుడా చాలా బాగుంటుంది. ఓ మహిళ న్యాయం కోసం, నమ్మిన నిజం కోసం చేసే పోరాటమే...అంకురం. రేవతి నటన అద్భుతం. సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట. హంసలేఖ స్వరపరచిన ఈ స్వర మధురం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మధురమైన ఆణిముత్యమే.....

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

ఆఆ.ఆఆ...మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు..అటో ఇటో ఎటో వైపు...

కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా...
అనుకుని కోడి కూత నిదరపోదుగా...
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నెల దారికి
ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాల రాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కాంతి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా..
జాలి చూపి తీరమే దరికి చేరునా

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

యుగములు సాగిన నింగిని తాకక..
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా..
ఒటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్లి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్ల బారడా

ఎవరో ఒకరు...ఎపుడో అపుడు
ఎవరో ఒకరు....ఎపుడో అపుడు
నడవరా ముందుగా..అటో ఇటో ఎటో వైపు....!
అటో ఇటో ఎటో వైపు...

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

చాలా మంచి పాట. అంకురం సినిమా కూడా నాకు చాలా ఇష్టం.

చెప్పాలంటే...... చెప్పారు...

సంతోషం నాకు ఇష్టమైన సినిమా మీకు నచ్చినందుకు

మైత్రేయి చెప్పారు...

thanks,
చాలా మంచి పాట. ఇంకా మంచి సినిమా. ఇలాంటి సినిమాలు ఇంక రావేమో తీసినా రిలీజ్ కావనుకొంటా.

చెప్పాలంటే...... చెప్పారు...

నాకు అదే అనుమానం. ఏదో మన అదృష్టం కొద్ది అప్పుడప్పుడు ఇలాంటి మంచి సినిమాలు ఒక్కటి వచ్చినా చాలు...

Praveen Mandangi చెప్పారు...

ఆ సినిమా చిన్నప్పుడు చూశాను. గుర్తు లేదు. నక్సలైట్ గా ముద్ర పడిన ఓం పురీని పోలీసులు అరెస్ట్ చెయ్యాలనుకుంటారు. పోలీసులు ఓం పురీని చేస్ చేస్తున్న సమయంలో అతను ట్రైన్ లో వదిలి వెళ్లిన బిడ్డని రేవతి అతనికి అప్పగించాలనుకుంటుంది. పోలీసులు రేవతిని వ్యభిచారం కేసు కింద అరెస్ట్ చేస్తారు. రఘువరన్ రేవతికి విడాకులు ఇస్తాడు. అంత వరకే స్టోరీ గుర్తుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

ఆఖరులో సుఖాంతం అవుతున్దిలెండి....మీకు బానే గుర్తు వుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner