7, డిసెంబర్ 2010, మంగళవారం

ధనం మూలం మిదం జగత్!!

డబ్బులు, అవసరం ఎవరివైనా ఒక్కటే. మనం ఎదుటివారికి ఇవ్వాల్సినా, మనకు వాళ్ళు ఇవ్వాల్సినా ఏదైనా ఒక్కటే. కాని కొంత మంది కాదు...కాదు నూటికి తొంభైతొమ్మిది మంది వాళ్ళవి మాత్రమే అవసరాలు, వారికి రావాల్సినవి మాత్రమే డబ్బులు అనుకుంటారు. మూడు ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు అయినా వాళ్లకి తిరిగి ఇవ్వాల్సినవి గుర్తు రావు. దీనికి నా ఫ్రెండ్ ఒకరు ఉదాహరణ. కొంత మందేమో తిని అస్సలు తమకేమి సంబంధం లేనట్లు వుంటారు. అలా వుంటే అడిగి అడిగి వాళ్ళే పోతారులే అన్న ధీమా అన్నమాట వాళ్లకి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇంతకుముందు చెప్పాను శాం వేజెండ్ల అని డెట్రాయిట్ లో ఉంటాడు చాలా జాగ్రత్త గా వుండండి వాడితో. ఇంకొంత మందేమో వాళ్ళ అవసరాలకి ఎలాంటి పాపపు పని చేయడానికైనా వెనుకాడరు. తల్లి, చెల్లి, అన్న, అక్క, నాన్న ఇలా ఏ బంధాలు వారికి గుర్తు వుండవు. బాధ్యతలకు డబ్బు వుండదు కాని వాళ్ళ జల్సాలకు ఎదుటి వారితో మూడు నెలల్లో ముప్పైవేల డాలర్లు ఖర్చు పెట్టిన్చగల ఘనులు. అది మాత్రమే కాకుండా పెట్టిన చేతిని కాటు వేసే ఒంటినిండా విషమున్న విష జీవులు. వీరిని మనుష్యులతో పోల్చలేము. దీనికి మా మరిది తోడికోడలు సాక్ష్యం అని చెప్పడానికి చాలా సిగ్గుగా వుంది. జాగ్రత్తన్డోయ్ వీళ్ళతో...!! వీళ్ళకి అమెరికా రావడానికి, అక్కడ తిరగడానికి కారు, జల్సాలకి, అన్నిటికి మమ్మల్నే పావులు గా వాడుకున్నారు. ఇక ఇంకో రకం ఏంటంటే బంధాలు, బాద్యతలు అన్ని మేమే మోస్తున్నాము అంటూ అందరి దగ్గరా డబ్బులు తీసుకుని బయటి వాళ్ళ దగ్గర ఎవరు ఏమి ఇవ్వలేదు అన్ని మా నెత్తిన వేసుకుని అన్ని మోస్తున్నాము అంటూ నాటకాలు వేస్తారు.
ఎవరికైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయండి ఊరికినే చెట్టుకి కాయవు కదా!! మన డబ్బులు మనకి ఎంతో ఎదుటి వారివి కుడా అంతే అని తెలుసుకుంటే.....ఎంత బావుంటుంది!! ఏదో ఇలా అప్పుడప్పుడు నా చేదు అనుభవాలు కుడా అందరితో పంచుకుంటే కొద్దిగా ప్రశాంతం గా ఉంటుందని + కొంత మంది అయినా వీళ్ళ బారిన పడకుండా ఉంటారని ఆశతో....!!-:))

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

అవును ఇలాంటి వారు చాలనే ఉన్నారు. ఎదుటి వారు మనసు విప్పి ఏదైన అడిగితే కాదు అని చెప్పద్దు అని అనిపిస్తూంది.మళ్లి ఎలా తీసుకున్నామో అలనే ఇవ్వాలని వారి మనసుకి కూడ ఉండాలి.

చెప్పాలంటే...... చెప్పారు...

మనసు వుంటే తీసుకున్నది తిరిగి ఇవ్వాలనిపిస్తుంది కాని ఈ మహానుభావులకు మనసు అంటే తెలియదు, మనసు వుండదు, మనుష్యులు కాదు....

astrojoyd చెప్పారు...

bahukrutha-veshaallo idokati

చెప్పాలంటే...... చెప్పారు...

డబ్బుల కోసం.....కదండీ...వాళ్ళకి తప్పు అనిపించదు

Indian Minerva చెప్పారు...

నేనైతే ఇది మానవ నైజం అని ఎప్పుడో డిసైడై పోయాను. ఇప్పటివరకూ నేను చూసిన వారందరూ ఇదే బాపతు. డబ్బు చేతికొస్తే బాకీలు తీరుద్దామనికాక ఎలా ఖర్చుచేద్దామనుకొనేవారే. ఒక్క గాడిదకీ ఇచ్చినవాడే కష్టాల్లో వున్నాడో పట్టదు. కాబట్టి నాయనలారా ఇంకొకరికి డబ్బులిచ్చేముందు ఆ తీసుకున్న వాడు కొన్ని సంవత్సరాలపాటు తిరిగివ్వకపోయినా మనకెమీ ఢోకా లేదనుకుంటేనే ఇవ్వాలి. ఇంకొందరు మర్చిపోతుంటారు మరప్పుడు మనకు డబ్బు ముఖ్యమో లేక అవతలివాడు ముఖ్యమో తేల్చుకొని మరీ ఇస్తే మంచిది. లేకపోతే అనవసరంగా మనం మోసగాళ్ళమైపోయె ప్రమాదంవుంది అవతలివాడి దృష్టిలో.

చెప్పాలంటే...... చెప్పారు...

చాలా చక్కగా అందరికి అర్ధమైయ్యేటట్లు చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner