9, డిసెంబర్ 2010, గురువారం

ఈ సారి అమ్మగారి కానుకేంటో..!!

సరిగ్గా ఇదే రోజు ఒక సంవత్సరం క్రిందట ఏమి జరిగిందో ఆంధ్రులైన అందరికి గుర్తు వుండే వుంటుంది. అధిష్టానం ఆదిదేవత సోనియా అమ్మగారు పుట్టినరోజు కానుక గా ఆంద్రరాష్ట్రాన్ని రెండుముక్కలు గా కత్తిరించి తమిళతంబి చిదంబరం గారితో తెలంగాణా ఇస్తామని ప్రకటన చేయించి అగ్నికి ఆజ్యం పోసి అది ఆరకుండా ఢిల్లి నుంచి గల్లి వరకు రాజకీయ చక్రం అలఓకగా తిప్పుతున్న అపర ఆదిదేవత. పరాయి దేశస్థురాలైనా భారతావనిని తన గుప్పిటలో పెట్టుకుని వ్యక్తి పూజకు ప్రాధాన్యం ఇచ్చి అవకతవకలను, అవినీతిని తనకనుకూలంగా మలుచుకుని తను చెప్పిందే శిలాశాసనంగా అమలుపరుస్తోన్న అఖండ ప్రతిభాముర్తి. తన కొడుకుని ప్రధానిగా గద్దె ఎక్కించడానికి అడ్డంకులు, అవరోధాలు లేకుండా చేస్తూ, ఎంతైనా విదేసీయురాలు కదా!! విభజించి పాలించడం లోని కిటుకులు బాగా ఒంటబట్టించుకుని ఆచరణలో పెడుతున్న అసామాన్యురాలు...!! అందరూ మరచి పోయిన భోఫోర్సు కుంభకోణాన్ని అలానే వదిలి ఎందరో ప్రతిభావంతులు, వివేకవంతులు, రాజకీయ పండితులను పదవి కోసం అధికారం కోసం తన చుట్టూ కుక్కల కన్నా హీనంగా తిప్పుకుంటున్న మేడం గారు ఎంత గొప్ప!! ఇది తిరుగులేని సత్యం!! ఎంతో ఘన కీర్తిని, అత్యున్నత శిఖరాలను అందుకున్న నాటి భారతావని పరిస్థితి నేడో రేపో ఏ దుస్థితిలో వుండబోతోందో!!
మరి ఈ సారి పుట్టినరోజు కానుకగా ఏ బహుమతిని అమ్మగారు అఖిలాండ భారతీయులకు అందజేయనున్నారో!! ఎదురు చూద్దాం రిక్తసిక్త రక్తవర్ణ హస్తాలతో...!!

14 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

thinking brain చెప్పారు...

medam...meeku sonia ante dvesham vundochemo gani ame videsiyuralu ante nenu voppukonu.bharata sampradayam prakaram ada pilla pellaina tarvata atta garintikostundi.ala ame kuda vachindi.ame ee decision teeskunna tana party ni batikinchukodaniki teeskuntondi.politics lo adalsina games anni chala knack ga adutondi.telangana issue ame brain child kadu.vakka sari alochinchandi.adi chala long pending issue.rahul gandhi pm aite ee?atanu indian kada?rendu sarlu gelchi kuda rahul ni pm enduku cheyaledu?alochinchandi please...

Goutham Navayan చెప్పారు...

*********
సరిగ్గా ఇదే రోజు ఒక సంవత్సరం క్రిందట ఏమి జరిగిందో ఆంధ్రులైన అందరికి గుర్తు వుండే వుంటుంది.
**************
అంతకంటే ఒక రోజు ముందు ఏమి జరిగిందో ఆంధ్ర నేతలు ఏమన్నారో, ఆంద్ర పార్టీలు ఏమని వాగ్దానాలు చేసాయో కూడా ఆంధ్రులు అయిన వారికీ ఆంధ్రులు కాని వారికి అందరికీ గురుండే వుంటుంది.

కాకపోతే ఆంధ్రులైన వాళ్ళు సహజంగానే వాటిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించి గుర్తులేనట్టు నటిస్తారు.

ముందు ఆత్మ విమర్శ చేసుకుని ఆ తర్వాత ఇతర్లను విమర్శిస్తే సబబుగా వుంటుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

సోనియా అంటే ద్వేషం లేదు కాని ఆమెలో విదేశీ రక్తం లేదంటారా!! రాహుల్ ని ఎందుకు చేయలేదో!! అన్నదానికి అంత అలోచిన్చనక్కర లేదు. పదవి పూలపానుపు అయినప్పుడు ఎక్కిస్తుంది. మీరే చెప్తున్నారు గా రాజకీయ చెదరంగం లో ప్రస్తుతానికి గెలుపు బాటలో అడ్డం వచ్చిన వారికి చెక్ పెడుతూ తెలివిగా భారతావనిని తన గుప్పెటలో పదిలపరుచుకుంది....కాదంటారా!! నిర్ణయాధికారాలు తీసుకున్నది పార్టిని బతికిన్చుకోడానికి కాదు. తన వంశం తప్ప మరొకరు ప్రధాని కాకుండాచేయడానికి!!

చెప్పాలంటే...... చెప్పారు...

నా ఉద్దేశ్యం ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్ లోని అందరూ అని.....ఇక్కడ ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాది అని కాదు.....అమ్మగారి ఆన్తర్యం గురించి చెప్పాలని....

astrojoyd చెప్పారు...

jagan cheta maro kumpati pettinchukoni kaalipovadaaniki ready avutondi kadaa...?

చెప్పాలంటే...... చెప్పారు...

చుద్దామండి ఇంకా ఎన్ని ఆటలు ఆడతారో!!

అశోక్ పాపాయి చెప్పారు...

ప్రతిభావంతులు, వివేకవంతులు, రాజకీయ పండితులను పదవి కోసం అధికారం కోసం తన చుట్టూ కుక్కల కన్నా హీనంగా తిప్పుకుంటున్న మేడం గారు ఎంత గొప్ప!

అశోక్ పాపాయి చెప్పారు...

eme jaagth kilaadi manaladni inka enta badapedtundo manake teliyanivvani mahammari.

చెప్పాలంటే...... చెప్పారు...

కేకు కట్ చేసాను కొట్టుకు చావండి అంది మనం అదే చేస్తున్నాము....ఆవిడ తెలివి ముందు అందరూ దిగ దుడుపే!!
ఇంతకు ముందు గౌతమ్ గారు ఆత్మ విమర్శ చేసుకోండి అన్నారు అది అందరికి వర్తిస్తుంది....

thinking brain చెప్పారు...

centre lo congress party lo gandhi ane title leka pote aa party batakadu.edi manam rajiv chanipoyina tarvata chusam.indian pm post eppudu poola panpu kadu.endukante future lo kuda eppudu ee party ki clear majority radu.anni partylani kalupukune povali.videsi raktam vundi correcte.alntappudu congress loni peddalanta ame ni teeseyyali.enduku teeyaleka potunnaru?gandhi title kosam.aa title party ki kavali.ok ame ki salam kotta lekano cm post doraka ledano jagan bayata kochadu.next assembly elections ki jagan enni seats gelava galadu?prantiya party lu geliste baguntundi gani vallu manchi palana echinappude kada prajalu congress ni marachi poyedi.vallu dictators la behave cheyyabatte kada charitra punaravratam avutundi...

Goutham Navayan చెప్పారు...

********** నా ఉద్దేశ్యం ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్ లోని అందరూ అని.....ఇక్కడ ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాది అని కాదు.....అమ్మగారి ఆన్తర్యం గురించి చెప్పాలని.... ********

నా విమర్శ కూడా "అమ్మగారి ఆన్తర్యం గురించి చెప్పాలని.... మాత్రమె మీరు ప్రస్తావించడం కాకుండా... మన ఆత్మవంచానాత్మక , దగా కోరు , కుళ్ళుబోతు, దగుల్బాజీ , నీతి బాహ్యమైన ..... ఇంకా ఇలాంటి పదాలేమైనా వుంటే వాటన్నిటినీ జతచేయండి ... లఫంగి ఆంధ్రా రాజకీయ నాయకుల మాటలను మాట మాత్రంగానైనా ప్రస్తావిం చలేదేమని.

చంద్రబాబు..." మీరు Telangana బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం" అన్నాడు.
(తెలుగు దేశం ఒక హాయ్ లెవెల్ కమిటీని వేసి విస్తృతంగా చర్చించి తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, పార్టీ మాని వేస్తోలో పెట్టి తెలంగాణా లో ఊరూరా బహిరంగ సభల్లో హామీలు గుప్పించింది, టీ ఆర్ ఎస్ తో ఎన్నికల పొత్తు కూడా పెట్టుకుంది.

అట్లాగే చిరంజీవి "సామాజిక తెలంగాణా" అని తెలంగాణా సభల్లో వాగ్దానాలు చేసాడు, అఖిల పక్షం మీటింగ్ లో ప్రభుత్వానికి తెలంగాణా పై హామీ ఇచ్చాడు.

అట్లాగే కాగ్రేస్స్ పార్టీ కూడా ౨౦౦౪ నుంచి తెలంగాణాకు ఎన్నికల మనిఫెస్తోల్లో హామీలు ఇస్తూనే వుంది.
ఆంద్ర కాంగెస్ ఎం ఎల్ ఎ లు అందరూ నిర్ణయాధికారం సోనియా గాంధీ కి దాఖలు పరుస్తూ డిసెంబర్ ౯ ప్రకటనకు ముందు తీర్మానం చేసారు.

ఇవన్నీ నిజమని నమ్మడమే సోనియా గాంధీ చేసిన పాపమా?

ముందు ఈ దొంగ ఆంద్ర రాజకీయ నాయకుల దొంగ వాగ్దానాల గురించి చర్చించి విమర్శించి ఆ తర్వాత ఇతర్లగురించి మాట్లాడండి అని నా మాటల "ఆంతర్యం "

చెప్పాలంటే...... చెప్పారు...

గౌతమ్ గారు!!
అమ్మగారు తెలంగాణా ప్రకటన చేసే ముందు మీరు చెప్పిన వాళ్ళు అందరిని సంప్రదిన్చినదా!! ఆ ప్రకటన ఆమె స్వంతం, దానిలో ఎవరికీ భాగం లేదు కావాలనే అలా చేసింది...ఇలా అందరూ కొట్టుకు చస్తే విభజించి పాలించడం తేలిక అని.....ఎంతసేపు ఆంధ్రా అంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరా!! లేదా పక్క రాష్ట్రంలో వున్నారా ఏంటి? హైదరాబాద్ నీ అభివృద్ధి చేసేటప్పుడు ఆంధ్రా తెలంగాణా అని అప్పుడు గుర్తుకు రాలేదా!! ఏరు దాటి తెప్ప తగలెయ్యడం అంటే ఇదే అనుకుంటా!!

ఇక ఆలోచించే...గారు!!
మీకు సోనియా అంటే అభిమానం వుంటే అది మీ ఇష్టం, కాని గాంధి పేరు లేక పొతే దేశ రాజకీయాలు లేవు అనకండి...ఎవరు వున్నా లేక పోయినా కాలం ఎవరి కోసం ఆగదు...కాబట్టి జగన్ పదవి ఇవ్వలేదని బయటికి వచ్చి ఉండొచ్చు కాని ఆమె చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దులా తల వూపలేక, ఏదో కొద్ది గా ఆత్మాభిమానం వుండి వచ్చాడేమో!! నిజాయితీ గా వున్న ఒక్క రాజకీయ పార్టీ కాని నాయకుడి పేరు కాని చెప్పండి ఈ రోజుల్లో!! గుడ్డి లో మెల్ల లా నమ్మిన వాడికి తప్పు ఐయినా రైటు అయినా కాపాడినవాడే నాయకుడు ఈ రోజు. అందుకే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లో ఆ నమ్మకాన్ని గెలుచుకున్నారు. చంద్రబాబుని ఈ రోజుకి కుడా జనం నమ్మడం లేదు అది ఆయన స్వయం కృతఅపరాధం..

thinking brain చెప్పారు...

nenemi sonia abhimanini kadu.nenikkada gandhi title leka pote desa rajakiyalu levani ana ledu.congress party batakadani cheppanu.YSR was a great politician.ayanni nenu vimarsincha ledu.jagan 30+ age ke kurchi kavalni anukunte kastam.ayana father 30 yrs kasta padite gani kurchi doraka ledu.NTR gariki 60+ age lo kurchi dorakindi.chandrababu ki vennupotu podiste gani kurchi doraka ledu.ayana enta great administrator aina anta nene ante ela.jagan ki matram 3 days lo kurchi kavali.atani attitude naku nacha ledu...

చెప్పాలంటే...... చెప్పారు...

కుర్చీ కోసమే కదండీ అందరి పాట్లు...వయసు, అనుభవం వున్నా, లేక పోయినా కుర్చీ కోసమే అందరి ఆట.జగన్ ఒక్కడే కాదు మూడు రోజులయినా, ముప్పయి ఏళ్ళు అయినా అనుభవం వున్నా మనకు కొత్తగా ఒరిగేదేంలేదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner