16, డిసెంబర్ 2010, గురువారం

వందనం అభివందనం!!

నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని.చిన్నప్పుడు కధలు మాత్రమే చదివేదాన్ని. కొంచం పెద్ద అయిన తర్వాత రచయితల, రచయిత్రుల ముఖాముఖి చదువుతూ అబ్బో భలేగా రాస్తున్నారు...పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఎంత బాగా చెప్తున్నారో!! అనుకునేదాన్ని.
ఇప్పుడు మొదట్లో బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పుడు అస్సలు నా బ్లాగు ఎవరైనా చూస్తారా!! చదువుతారా!! అనుకునేదాన్ని. ఏమి రాయాలో కూడా తెలియదు, ఎలా రాయాలో కూడా తెలియకుండా ఏదో రాయడం మొదలు పెట్టేసాను. కొన్ని రోజులు ఐనంక కొన్ని బ్లాగులు చూసి ఎంతమంది బ్లాగు చూసారో అని తెలుసుకునే లెక్కల పట్టిని అమర్చాను. తర్వాత కూడలి లో చేరడం, బ్లాగు మిత్రుల పరిచయం,ఇలా మిగిలినవి ఒక్కొక్కటిగా బ్లాగు మిత్రుల సహాయంతో మార్చుకుంటూ వచ్చానన్న మాట. గూగులమ్మ కుడా బాగా సహాయపడింది ఈ విషయంలో....!!
రాయడం మొదలు పెట్టిన కొత్తలో......ఏమి రాస్తే ఏమంటారో అని భయం!! కొన్ని బ్లాగుల్లో కామెంట్లు చూసి అలా అనిపించేది లెండి. ఇంకేముంది ఏమైతే అది అయ్యింది నాకు అనిపించింది రాస్తే పోలా!! అని అలా రాయడం మొదలయ్యింది....కవితలు, కబుర్లు, నిజాలు, ఇలా ఒకటేమిటి...అనిపించినవి, అనుకున్నవి అక్షర రూపంలో రాయడం వాటికి కామెంట్లు వస్తే బోల్డు సంతోషం తో పొంగిపోవడం...కామెంట్లు రాకపోతే అయ్యో ఈ టపా ఎవరికీ నచ్చలేదేమో!! అని కొద్దిగా బాధ పడటం...కామెంట్లకి సమాధానం రాస్తూ ఓ పేద్ద రచయిత్రిని అయిపోయానని ఇంకా పేద్ద ఫీలింగ్ తో...అప్పటి ముఖాముఖిని గుర్తు చేసుకుంటూ నిజంగా భలే వుంది ఆ అనుభూతి!! నేనూ...ఈ అంతు తెలియని మహాసముద్రంలో ఓ చిన్న నీటి బిందువునైనందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నా ఈ ఆనందానికి కారణమైన.... నన్ను, నా బ్లాగుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి వందనం అభివందనం!!

17 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జ్యోతి చెప్పారు...

లేట్ గా ఐనా బ్లాగ్ యానివర్సరీ శుభాకాంక్షలు..

చెప్పాలంటే...... చెప్పారు...

నా బ్లాగు యానివర్సరీ సరిగ్గా నాకు గుర్తులేదండి....కాని బ్లాగు ఎప్పుడో మొదలు పెట్టినా పోస్టులు రాయడం మొదలు పెట్టి సంవత్సరం అవుతోంది....మీరు లేట్ కాదు నేనే లేట్. థాంక్ యు జ్యోతి....-:)

లత చెప్పారు...

ఓ, మీకు అభినందనలు,మీ పొస్ట్స్ కి హ్యాపీ యానివర్సరీ
ప్రస్తుతం నేనూ మీరు దాటి వచ్చిన ఆ ఫేజ్ లొనే ఉన్నట్టు ఉన్నాను.
once again congratulations

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు లతగారు, మీకు కుడా గుడ్ లక్....మీరు బాగా రాస్తారు

మాలా కుమార్ చెప్పారు...

బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మాలా గారు

శ్రీలలిత చెప్పారు...

బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు...

SRRao చెప్పారు...

' కబుర్లు కాకరకాయలు ' కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

సి.ఉమాదేవి చెప్పారు...

మృదుమధుర మంజులమయం పరిచయపు పలుకుల జ్ఞాపకాల బ్లాగ్వూసులు.యానివర్సరీకి కబుర్లు కజ్జికాయలు చేసి తినిపించారు.మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు శ్రీలలిత గారు

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు ఎస్.ఆర్ రావు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

నిజంగా అంత బాగా చెప్పానంటారా!! మెచ్చుకున్నందుకు మధురమైన మీ కామెంట్ కి నా ధన్యవాదాలు...ఉమాదేవి గారు

శోభ చెప్పారు...

మంజుగారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఇలాగే మరిన్ని పోస్టులు రాయాలని కోరుకుంటూ..

మీ ఒక్కో పోస్ట్ చదివించేలా ఉంది. నిజానికి నేను రెండు రోజుల క్రితం నుంచే మీ బ్లాగును చూస్తున్నాను. చూడగానే భలే సంతోషం వేసింది. చాలా బాగా రాస్తున్నారు. పెద్ద రచయిత్రిని అని ఫీలైపోతున్నానని రాశారు.. నిజంగా మీరు పెద్ద రచయిత్రే అందులో ఎలాంటి సందేహం లేదు.. ఇలాగే దూసుకెళ్లండి మరి... :)

John Vincent Raj చెప్పారు...

It's really great

Pranav Ainavolu చెప్పారు...

మంజు గారు,

buzz లో పోస్ట్ అయినవి చదవడమేగానీ మీ బ్లాగ్ పోస్ట్స్ చదవడం ఇదే మొదలు. సమయాభావం వల్ల ఇన్ని రోజులూ కుదరలేదు. చాలా బాగున్నాయి!
బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Ennela చెప్పారు...

manju gaaru, mee blaag ippude parichayamayyindi..inka nenu infant ni...unga unga....hahaa
mee blaag ki puttina roju subhaakaankshalandee...

చెప్పాలంటే...... చెప్పారు...

ఒక ఇరవై రోజుల నుంచి బ్లాగు పోస్ట్లు చూడటం, టపాలు రాయడం కుదరలేదు....శోభ గారు ఏదో నాకు వచ్చినట్లు అనిపించింది రాస్తాను మీకు నచ్చుతున్నందుకు, అభినందనలకు థాంక్ యు
జాన్ గారికి, ప్రణవ్ గారికి, ఎన్నెల గారికి కృతజ్ఞతలు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner