11, జనవరి 2011, మంగళవారం

మానవత్వం పరిమళించిన వేళ....

క్రిందటి నెల పదహారో తారీకున జరిగిన ఓ సంఘటనతో కొద్ది మందిలోనైనా మంచి, మానవత్వం ఇంకా మిగిలి వున్నాయని దైవత్వం అనేది కష్టంలో వున్నవారికి మనం చేయగలిగిన సాయం చేయడమే అని అనుభవపూర్వకంగా నిరూపితమైన విష్యం మీతో పంచుకోవాలని ఈ టపా.
మా నాన్నగారు ఓ ఇరవై ఏళ్ల పైనే ప్రతి సంవత్సరం శబరిమలై కి మాల లో వెళ్తున్నారు. రెండు ఏళ్ల క్రిందట కుడా మా ఊరు దగ్గర నుంచి ఒక్కరే పాదయాత్రతో ఇరవైఐదు, ఇరవైఆరు రోజులలో బరిమలైకి వెళ్లి వచ్చారు. ఈ సంవత్సరం కుడా యానాం నుంచి పాదయాత్రతో బయలుదేరిన ఇరవై మందితో కలిసి అయ్యప్ప దగ్గరకు బయలుదేరి వెళ్లారు. కొంతమంది తిరుపతి కొండకు వెళ్ళడంతో మిగిలిన వాళ్ళు ముందుకు సాగారు. ఇంకా ఒక రెండు మూడు రోజులలో బరిమలైకి వెళిపోతారు అనగా డిసెంబరు పదహారో తారీకున తెల్లవారు ఝామున ఒక ఇద్దరు స్వాములకు ఏది కొట్టిందో కుడా తెలియకుండా దెబ్బలు బాగా తగిలాయి. ఒక స్వామికి కొద్ది దెబ్బలు, మరొక స్వామికి కాలు విరిగి పోయింది. నాన్న హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి, వాళ్ళని హాస్పటల్ కి పంపడానికి అన్ని ఏర్పాటులు చేసి ఒకరిని ఆ స్వామితో వుండి వాళ్ళ ఊరు తీసుకు వెళ్ళమని చెప్తే మిగిలిన వారిలో ఎవరు అందుకు ఒప్పుకోలేదంట. అందరూ హాస్పటల్ కి వెళ్లి వాళ్ళ వాళ్ళు వచ్చేవరకు వుండి తరువాత వెళ్దాము అంటే నడకన బయలుదేరి బస్సు ఎక్కడానికి ఇష్టం లేక అందరిని పంపి దెబ్బ తగిలిన స్వామి వెంటరమ్మని అడిగినా అంతా ఇబ్బంది లేకుండా చేశాను అని చెప్పి ఈయన ఒక్కరే నడక మొదలు పెట్టారు. ఆ రోజు సాయంత్రానికి ఒక యాభై ఎనిమిది కిలోమీటర్లు ముందుకు వచ్చారు. ఇంకో రెండు గంటలు నడిస్తే పెట్రోలు బంకు వస్తుంది అక్కడ వుంవచ్చు అనుకుంటుంటే సాయంత్రం ఏడు కి రోడ్డుకి నాలుగు, ఐదు అడుగుల దూరంలో నడుస్తుంటే ఏది కొట్టిందో కుడా తెలియకుండా పడిపోయారు. పడిన చోటుకి వండ గజాల దూరం వరకు కుడా ఎవరు ఉండరంట. కాని పడిన వెంటనే ఒకటి రెండు నిముషాల వ్యవధిలోనే ఇద్దరు కొద్దిగా పెద్ద పిల్లలు వచ్చారంట. దూరంగా పడిపోయిన ఫోను, చేతి కర్ర ఇమ్మంటే ఇచ్చి కొద్దిగా ఇవతలికి రమ్మంటే అప్పటికీ కాని ఈయనకు కాలు విరిగిన సంగతి తెలియలేదంట. వాళ్ళ సాయంతో విరిగి వేలాడిన కాలుతో కొద్దిగా రోడ్డు వైపుకి జరిగారంట. ఈలొపల ఓ పది మంది వరకు వచ్చారంట. హెల్ప్ లైన్ కి ఫోన్ చేయమని చెప్తే వాళ్ళలో ఒకరు ఫోన్ చేసారంట. తరువాత హాస్పటల్కి వెళ్ళేటప్పుడు వివరాలు అడిగితే నాన్న ఫ్రెండ్ పేరు చెప్పి ఫోన్ చేస్తే, ఫస్ట్ ఎయిడ్ చేసి పంపండి అని చెప్తే అంబులెన్స్ లో వాళ్ళు, వాళ్లకి ఫోన్ చేసిన అతనిని మీ కేర్ టేకర్ అని నాన్నకి చూపించారంట. హాస్పటల్ లో పక్కన ఒక లాయర్ పదివేలో, ఇరవై వేలో తెలియదు ఒక కట్ట డబ్బులు పొట్ట మీద పెట్టి తీసుకోమంటే డబ్బులు నాకు వద్దు అంటే ఎవరికైనా మంచి పనికి ఇవ్వండి అన్నారంట. మీ డబ్బులు నేను కాదు మీరే మంచి పనికి ఉపయోగించండి అపాత్ర దానం చేయవద్దు అని తిరిగి నాన్న ఇచ్చేసారంట. పక్కనే వున్న కేర్ టేకర్ అని చెప్పిన అతనిని అప్పటివరకు హాస్పటల్ మనిషి అనుకుని వివరాలు అడిగితే "మీకు దెబ్బ తగిలినప్పటి నుంచి అన్ని నేనే చేసాను" అని చెప్పాడంట. వెంటనే నాన్న నువ్వే నా దేవుడివి నీ ఫోన్ నెంబరు నా డైరి లో మొదటి పేజిలో రాయి అంటే కళ్ళవెంట నీరు పెట్టుకున్నాడంట. తరువాత అంబులెన్స్ కి డబ్బులు కట్టడానికి వెళ్లినంక ఇస్తాను అంటే కొద్దిగా నమ్మలేదంట. అతనే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని అన్ని డబ్బులు కట్టేసి నాన్నకి చెప్పి తమ్ముడికి ఒక యాభైవేలు ఇచ్చి నాన్నతో పంపారు. వాళ్ళ ఫోన్ నెంబరు కాని, అడ్రస్ కాని, అకౌంట్ నెంబరు కాని ఇవ్వలేదు, అడిగితే తమ్ముడు ఇస్తాడు అని చెప్పి ఎంతో జాగ్రత్తగా పంపారు. వచ్చిన వాళ్లకు డబ్బులు ఇవ్వబోతే అస్సలు తీసుకోలేదు, వివరాలు చెప్పలేదు. డ్రైవర్ ఫోన్ నెంబరు బలవంతాన ఇచ్చాడు. ఒక లెటరు జాగ్రత్తగా చేర్చాము అని రాసి సంతకం చేయించుకుని కనీసం మంచినీళ్ళు కుడా తాగకుండా వెళ్ళిపోయారు. తరువాత నాలుగూ రోజులకు లాయర్ కి నాన్న ఫోన్ చేస్తే అతనే యాక్సిడెంట్ చేసింది అని నాన్న వాళ్ళు బయలుదేరిన వెంటనే అందరిలో ఒప్పుకున్నాడంట. పోలీసులు మళ్ళి వెనక్కి పిలిపిస్తాము అంతే వద్దు వెళ్లనీయండి అని చెప్పాడంట. నాన్న పోలీసులు అడిగితే ఎవరో, ఏదో కుడా చూడలేదు తెలియదు అని చెప్పారు. నిజంగా అతను ఒప్పుకోవాల్సిన అవసరం కుడా లేదు.
తప్పులు అందరూ చేస్తారు కాని తెలుసుకుని ఒప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది వున్నారో మన అందరికి తెలుసు. అమ్మానాన్నని చూడటం కుడా భారమనుకునే కొడుకులు, కూతుర్లు వున్న ఈ రోజుల్లో తప్పు తనవల్ల జరిగినా మాకు మా నాన్నని పువ్వుల్లో పెట్టి అప్పగించిన పేరు తెలియని ఆ మహానీయునికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎవరికి ఏమైతే మనకెందుకు మనం బాగున్నామా లేదా అని, దానికోసం వావి వరుసలు చూడకుండా తమ స్వార్ధాన్నే చూసుకునే వాళ్ళున్న ఈ రోజుల్లో మానవత్వం మూర్తిభవించిన ఈ మానవతామూర్తికి తల ఒగ్గి పాదాభివందనం చేస్తున్నా!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

అయ్యో ఇప్పుడు ఎలా ఉన్నారండీ నాన్నగారు,
తప్పు చేసినా క్షేమంగా ఇంటికి చేర్చారు,పోన్లెండి ఆ దేముడే సహాయం చేయించాడు.

అజ్ఞాత చెప్పారు...

మీరేం రాశారో అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. అంతా కలిపేసి రాసేశారు. మీకు విషయం అంతా తెలుసు కనుక మీరు ఎలా రాసినా మీకు అర్థం అవుతుంది. కాని విషయం తెలియని వారికి చదువుతుంటే చాలా గందరగోళంగా ఉంది.

ఇంతకీ మీ నాన్నగారికి ఎలా ఉందండి ఇప్పుడు? కాలు విరిగి వేలాడితే ఎంత బాధో కదా. చాలా బాధపడి ఉంటారు. ఆయనకి తొందరగా తగ్గాలని కోరుకుంటున్నాను.

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ దేవుని దయ వల్ల చాలా బాగున్నారు రెండు సార్లు ఆపరేషన్ చేసారు చాలా బాగా రికవర్ అవుతున్నారు...ఏమోనండి అప్పటికే చాలా ఎక్కువ రాసేసానేమో అని అనిపించింది. దెబ్బ కొట్టించిన ఆ దేవుడే మళ్ళి జాగ్రత్తగా మీరు నమ్మరేమో కాని ఇప్పటికీ కుడా కొద్దిగా అయినా నొప్పిలేదు నాన్నకి. అంత బాగా చూసుకుంటున్నాడుదేవుడు.

అశోక్ పాపాయి చెప్పారు...

అవునండి చాల మంచి పని చేశారు. గండం గట్టెకింది నేను కూడ ఈ మానవతామూర్తికి నమస్కారాలు తెలియజేస్తున్నాను

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు అశోక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner