31, జనవరి 2011, సోమవారం

ప్రేమ - పెళ్లి

ఈమద్య తరచూ వింటున్న విష్యం ఇంట్లోవాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకోవడం. ప్రేమ తప్పు కాదు, కాని అందరిని బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండగలరా!! పెద్ద వాళ్ళ అండ అవసరం లేకుండా బతకడం చాలా కష్టం. అల్లారుముద్దుగా పెంచి మనకి ఏది కావాలంటే అది ఇచ్చి కష్టం అనేది తెలియకుండా పెంచిన వారిని కాదని వెళ్లి పోవడం మంచి పని కాదు. ఇంట్లోవాళ్ళు ఇష్టపడక పొతే అర్ధం అయ్యేటట్లు చెప్పాలి కాని వారిని నలుగురిలో తలదిన్చుకునేటట్లు చేయకూడదు, అది ప్రతి ఒక్కరి బాద్యత.
నా విష్యమే తీసుకుంటే....నాన్నకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. అప్పటి వరకు మనుష్యులు రెండు రకాలుగా మాట్లాడగలరని నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ పది జన్మలకు సరిపడా జీవిత పాఠాల్ని నేర్చుకున్నాను. రాసిపెట్టి వున్నప్పుడు ఏది మనం తప్పించుకోలేము. ఇది మాత్రం నిజం అక్షరాలా!!
నీ చుట్టూ డబ్బు వుంటే అందరూ నీ చుట్టాలే లేకపోతే అస్సలు నువ్వు, నీ ఉనికి కుడా వాళ్లకు తెలియదు, నువ్వు ఎదురుగా వున్నా కుడా!! కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోడానికి ఎవరు వుండరు నీ దగ్గర డబ్బు లేకపోతే. ఈ విషయంలో ఎవరికీ మినహాహింపు లేదు ఒక్క అమ్మానాన్నలకు తప్ప. కొడుకైనా,కూతురైనా, భార్యైనా, భర్తైనా, ఏ బంధుత్వమైనా!! ఒక పది శాతం ఈ కోవకు చెందని వాళ్ళుంటారేమో!!
ప్రేమ...అందరి ప్రేమను పొందాలి కాని అందరిని ఏడిపించకూడదు.

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Ennela చెప్పారు...

నిన్న రాత్రి 'ఫిట్టింగ్ మాస్టర్ సినేమా చూసాను...పేరు నచ్చలేదు అని ఏదో అనాసక్తం గా చూసాను..కానీ చివరికి కాన్సెప్ట్ బాగుంది అనిపించింది..మీరు చెప్పింది కూడా అదే.

లత చెప్పారు...

నిజం చెప్పారండీ.బావుంది

మాలా కుమార్ చెప్పారు...

మీరు చెప్పింది అక్షరాలా నిజం .

చెప్పాలంటే...... చెప్పారు...

మనం రోజు ఇలాంటివి ఎన్నో చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం కదా!! కొన్నిటికి ప్రత్యక్ష సాక్షిని కూడాను....
ఎన్నెల గారు నేను ఆ సినిమా చూడలేదండి వీలైతే చూస్తాను
నాతొ ఏకిభవిన్చినందుకు ధన్యవాదాలు ఎన్నెల, లత, మాలా గారు....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner