8, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఆక్రోశం....!!!

చిటపట చినుకుల సవ్వడి
తడిపొడిగా తడిసిన పుడమి
తొలకరి జల్లుతో పులకరించిన ప్రకృతి
పరవశించి పసిడి పంటలు పండిస్తుందనుకుంటే....
కన్నెర్ర చేసిన వరుణుడు కష్టాల కడలికి పంపి
అప్పుల ఊబి లోనికి తోసాడు...కాయకష్టంతో
బతుకు బండిని లాగే రైతన్నను....
ఆపన్న హస్తం అందించి సాయం చేస్తారని
నాయకుని ఎన్నుకుంటే అధికార పీఠం అధిష్టించడానికి
మొదటి మెట్టుగా సామాన్యుని చేసుకుని
ఓట్ల కోసం వాగ్దానాలు గుప్పించి గెలుపు కుర్చీని చేరుకొని
పట్టుపరుపుల నోట్ల కట్టలపై చల్లగా సేద తీరుతూ...
సామాన్యుని ఆకలి కేకలను, చావులను పట్టించుకోని
పదవి కోసం పాకులాడే....ఈ బడాకోరు అవినీతి నాయకులకు
కనువిప్పు కలిగించే రోజు రానుందో!! లేదో!!
పనికి రాడని పక్కన పెట్టిన సామాన్యుడే
పెను ఆయుధమై సంచలనాలు సృష్టించే రోజు
ఈ కుహనా రాజకీయ నాయకుల మనుగడ
ఏ తీరం చేరనుందో!!

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

బావుందండీ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు

ఇందు చెప్పారు...

chala bagundandi :)

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలు ఇందు గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner