14, మార్చి 2011, సోమవారం

ఇష్టమైన జ్ఞాపకం....!!

తరచి తరచి తలచుకొన్న కొద్దీ పెరిగే ఇష్టం
ఎంత ఆస్వాదించినా ఇంకా.... ఇంకా....అనిపించేంత ఇష్టం
నీతో నువ్వున్నప్పుడు నీతోనే నేనున్నానంటూ
నిను తడిమే పలకరింపే నీకిష్టమైన జ్ఞాపకం!!
ఎప్పటికీ పాతది కాకుండా ఎప్పుడూ కొత్తగానే...
ఎప్పటికీ కావాలనిపించేదే ఇష్టమైన జ్ఞాపకం!!
ఎద తలుపులు తెరిస్తే...ఏకాంతంలో నీ చెలిమి !!
నీలోనుంచి జాలువారే జ్ఞాపకాల దొంతరలే!!నీ నేస్తాలు !!
నీ ఆనందం, నీ ఆహ్లాదం, నీ ఇష్టం, నీ అయిష్టం నీ జ్ఞాపకాలే!!
ఎప్పటికీ మదిలో ఉండిపోయే ఇష్టమైన జ్ఞాపకానికి
మరణం ఉందంటారా!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

మీ ఇష్టమైన జ్ఞాపకం చాలా బావుంది

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు లత గారు :)

lalithag చెప్పారు...

Thanks for using the picture from Telugu4kids :)
Ths story is here:
తార పూలు ఏరుకుంటోంది

మాలా కుమార్ చెప్పారు...

మీ ఇష్టమైన జ్ఞాపక ము , పారిజాత పూలు చాలా బాగున్నాయండి .

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు మాలా గారు నా పోస్ట్ నచ్చినందుకు...
లలిత గారు ఆ పారిజాతాలు ఎందుకు పెట్టానంటే ఆ పరిమళంలా జ్ఞాపకాల అనుభూతుల పరిమళాలు ఉంటాయని.....థాంక్యు మీ కామెంట్ కి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner