29, మార్చి 2011, మంగళవారం

ఆలోచిస్తారు కదూ...!!















నిన్నటి పాడుతా తీయగా ఎంతమంది చూసారో నాకు తెలియదు గాని, పిల్లల ఫైనల్స్ అని మొదలు పెట్టి పద్మభూషణ బిరుదాంకితుడు, ఎన్నో ఆణిముత్యాలాంటి పాటలకు చిరునామా అయినా వాణిజయరాం గారు ఇద్దరు ఒకరిని ఒకరు పోగుడుకోవడానికి సరిపోయింది కాలమంతా!! పాటలు పాడిన పిల్లలను మాత్రం వారికి ఇష్టమైన వారిని కొద్ది గా పొగిడి మిగిలిన ఇద్దరినీ అంతా బాగానే పాడారు కాని పాటలో జీవించలేదు, సంగీత పరంగా, సాహిత్య పరంగా అంతా చాలా బావుంది అని మార్కులు మాత్రం వారి ఇష్టం వచ్చిన వారికి వేసారు. అనుకున్నట్లే మొదటి స్థానం వారు అనుకున్న వారికి ఇచ్చి బాగోదని రెండో స్థానం ఈ సారికి వేరే వారికి ఇచ్చారు. ఆఖరు గా మాత్రం వారు అనుకున్న వారికే ఇస్తారు ఎవరు ఎంత బాగా పాడినా....ఇంతకుముందు ఈ టి వి లో ఇలాంటి పిల్లల పాటల ప్రోగ్రాం లో వేటూరి గారు, అనంత శ్రీరాం గారు ఈసారి ముఖ్య అతిధి శ్రీమతి వాణి జయరాం గారు జడ్జిలు గా వున్నారు. అప్పుడు కుడా వాణి జయరాం గారు ఇలానే చేసారు. చాలా కార్యక్రమాలకు ముఖ్య అతిధి, జడ్జి గా న్యాయమైన తీర్పు చెప్పే స్థానంలో వుండి పక్షపాతం చూపించడం చాలా బాధగా వుంది చూడటానికి. పాటలో లీనమై, శృతి, లయలలో, గమకాలు పలికిస్తూ పాడటం ముఖ్యం కాని...నువ్వు నవ్వలేదు పాటను ఫీల్ అవుతూ పాడలేదు అనడం సబబు కాదు బాగా పాడినా కుడా!! ఒకప్పుడు చాలా సార్లు బాలు గారే శృతి తప్పకుండా స్పష్టంగా వంక పెట్టలేనట్లు పాడుతున్నావని ఇప్పుడు ఫీల్ లేకుండా పాడుతున్నావని ఫైనల్ లో అనడంలో నిజం ఎంతో బాలు గారి మనస్సాక్షికి తెలుసు. నాకు ఈ ప్రోగ్రాంలో బాగా ఇద్దరి స్వోత్కర్ష ఎక్కువైనట్లు అనిపించింది. ఇద్దరు గొప్ప వాళ్ళే....కాని ఒకరి గురించి మరొకరు చెప్పుకోవడమే మిగిలింది స్టేజ్ పైన. పిల్లల ప్రోగ్రాంని పిల్లల ప్రోగ్రాం లానే ఉండనివ్వండి. మీరు ఎంత ప్రతిభావంతులో ప్రపంచం అందరికి తెలుసు కొద్దిగా చెప్తే చాలు...ఇంక ఆపండి మీ సొంత గొప్పలు అనిపించుకోకండి. మా మనస్సులో మీరు, మీ ఆణిముత్యాల పాటలు ఎప్పటికీ అజరామరంగా మిగిలి పోతాయి. మిమ్మల్ని కోరేది ఒక్కటే న్యాయమైన తీర్పు చెప్పమని....మాత్రమే....ఆలోచిస్తారు కదూ...!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vallisarvani చెప్పారు...

You are right.

చెప్పాలంటే...... చెప్పారు...

బాగా పాడే వాళ్లకి న్యాయం జరిగితే చాలండి....థాంక్యు వల్లి గారు

సో మా ర్క చెప్పారు...

నిజాన్ని ఇంత నిష్టూరంగా బట్టబయలు చెయ్యడమేనా మంజూ మేడం గారూ ! ?ఇది న్యాయమేనా ?
వ్యాపార లక్షణాల సిరప్ గ్రోలుడు.! బలవర్ధకం.

చెప్పాలంటే...... చెప్పారు...

నిజం నిష్టూరమే....కదండీ సోమార్క గారు వ్యాపార లక్షణాలు నాకు వద్దండి..:) థాంక్యు అండి మీ స్పందనకి

అజ్ఞాత చెప్పారు...

meeru maree critical gaa choostunnaaru. mee opinion ni fact laa cheppadam baaledu.

చెప్పాలంటే...... చెప్పారు...

క్రిటికల్ గా చూడటం కాదు మీరు ఒక సారి ఆ ప్రోగ్రాం చూసి చెప్పండి నేను రాసిన దానిలో నిజమెంతో మీకే తెలుస్తుంది.....నా అభిప్రాయం కాదు నిజం అదే....మీరు బాధ పడితే దానికి క్షమించండి

కమల్ చెప్పారు...

అసలు ఇప్పుడొస్తున్న పాడుతాతీయగా ఫోగ్రామ్‌లోనే కాదు..మిగతా చానల్స్‌లో వస్తున్న ఫోగ్రామ్‌లలో పాల్గొంటున్న పిల్లలు, పెద్దల్లో కూడా ఎవరూ అంతచెప్పుకోతగ్గ ప్రతిభ వున్న వారు ఎవరూ లేరు..! ఏదో దొరికిన వారితోనే కార్యక్రమాలు కానిస్తున్నారు..! అంతే గాని మీరనుకుంటున్నట్లు లేక టి.వి స్క్రీన్ మీదుగా చూస్తున్నంతగా గొప్పగా వారి ప్రతిభ డైరెక్ట్‌గా ఆ ఫోగ్రా‌ని చూసినప్పుడు కనపడదు..! డైరెక్ట్‌గా చూసినప్పుడు కనపడే పొరబాట్లను రికార్డింగ్‌ సమయంలో సాంకేతికపరంగా చాలా వరకు మాన్యుపులేట్ చేస్తారు..అవన్ని అయ్యాకే ఏయిర్‌లో ప్రసారం చేస్తారు. మీరందరూ చూస్తున్నవన్ని అలా మాన్యుపులేట్ చేసినవే. కాబట్టి టి.వి చూస్తూ జడ్జ్ చేయడం అంత సబబు కాదేమో..! నేను గతంలో ఆ పాడుతాతీయగా ఫోగ్రామ్‌లకు సాంకేతికనిపుణుడిగా పనిచేసాను కొన్ని ఎపిసోడ్స్‌లలో. పాటలుపాడే గాయకుల లేక గాయనీమణుల మైకులు పాడుతున్న సమయంలో వారి గాత్రాన్ని అనుసరించి కొన్ని విదాలుగా " ట్యూన్ " చేయబడుతాయి రికార్డింగ్ కోసం. అవన్ని డైరెక్ట్‌గా వింటున్నప్పుడు కనపడవు..అక్కడ జడ్జ్ చేయడానికి అవకాశముంటుంది.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు చెప్పింది నిజమే అయ్యి ఉండొచ్చు కాని పాడిన వారిలో ఎవరు బాగా పాడారో లేదో తెలుస్తుంది కదా చూసేటప్పుడు మరి బాగా పాడని వాళ్లకు తప్పులు పాడిన వాళ్లకు ఎక్కువ మార్కులు ఇవ్వడం సబబు కాదని నా అభిప్రాయం....ఏదైనా కానివ్వండి మీ అభిప్రాయానికి, వివరణకు ధన్యవాదాలు కమల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner