3, ఆగస్టు 2011, బుధవారం

అరిషడ్వర్గాలు ప్రేమాభిమానాలు ఒక్క చోట కలిస్తే....!!

ఆనందం ఆహ్లాదం
కోపం ఆవేశం
చిరాకు విసురు
ప్రేమ అభిమానం
బాధ దుఃఖం
ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!
సమాధానం ఇక్కడ పక్కన వుంది చూడండి.......ఇది మా కుటుంబ కలయిక......ఒక పదిమందికి మాత్రమే రావడానికి వీలుకాలేదు...భలే బావుంది కదు..!! మీరు కుడా ఒకసారి కలిసి చూడండి ఎంతబావుంటుందో తెలుస్తుంది...!!!

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

very nice of reunion, but the title is probably not appropriate.

vijay చెప్పారు...

అందరూ కలిస్తే ఆనందం ఆహ్లాదం మాత్రమే కాదు ఆనందభాష్పాలు కూడా

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారు మీ కుటుంబ కలయిక చాలా బాగుందండీ..
ఇలా కుటుంబం అంతా ఒక్క చోట కలిస్తే మీరు చెప్పిన భావాలన్నీ దాచాలనుకున్నా దాగవేమో

అజ్ఞాత చెప్పారు...

హరిషడ్వర్గాలు కాదండీ బాబూ ! అరిషడ్వర్గాలు.

రసజ్ఞ చెప్పారు...

నిజమే అండి అందరూ కలిస్తే ఆ ఆనందం, సందడి ఆ తీరే వేరు. మా కుటుంబం గుర్తుస్తోంది మీ ఫోటో చూస్తుంటే.

అజ్ఞాత చెప్పారు...

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అరిషడ్వర్గాలు అంటారు. అరి అంటే శత్రువు. ఈ ఆరు మనలో ఉండే ఆరుగురు శత్రువులు. వెరసి దుర్గుణాలు. చక్కని కుటుంబానికి సరియైన వ్యాఖ్య పెడితే బాగుండును. మీ ఫోటో కు ఈ కేప్షనుకు సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కవి హృదయం లో ఏముందో వివరిస్తారా కాస్త.

చెప్పాలంటే...... చెప్పారు...

తరువాత గుర్తు వచ్చిందండి అరి అని రాయకుండా హరి అని రాసాను అని..మార్చడానికి టైం పట్టింది క్షమించండి పొరపాటుకి. తెలుగు నాకు కాస్త బానే తెలుసు అండి.....అన్ని కలగలిపి ఉన్నదే మా కుటుంబ కలయిక అండి అందుకే ఆ పేరు పెట్టాను.... వివరాలు కావాలన్నారు మీ పేరు చెప్పలేదు....అజ్ఞాత గానే వున్నారు....
ఆనందభాష్పాలు....కుడా విజయ్...
ఒక్క భావం కుడా దాగలేదు రాజి చాలా చాలా బాగా అనిపించింది అన్ని అనుభూతుల కలయిక కదా!!
అందరి కుటుంబాలలోను.... ఇలానే అన్ని వుంటాయి కదండీ రసజ్ఞా...
విజయ్, రాజి, రసజ్ఞా అందరికి ధన్యవాదాలు.... అజ్ఞాత గారు మీకు కుడా....

చెప్పాలంటే...... చెప్పారు...

అందరిలోనూ అరిషడ్వర్గాలు వుంటాయి కాదంటారా!! వాటితో పాటుగా ప్రేమాభిమానాలు కుడా వుంటాయి కుటుంబంబాలలో....అందుకే అలా పెట్టాను

లత చెప్పారు...

బావుందండీ మీ ఫామిలీ ఫొటో, అందరూ ఎప్పుడన్నా ఇలా కలిస్తే బాగుంటుంది

జవహర్ బాబు చెప్పారు...

అపూర్వ సంగమం...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner