5, ఆగస్టు 2011, శుక్రవారం

కార్పోరేట్ స్కూల్లో పిల్లల పరిస్థితి.....

ఈ రోజుల్లో పిల్లలను స్కూలుకి పంపాలన్నా....హాస్టల్లో పెట్టాలన్నా చాలా భయంగా ఉంటోంది...ఎంత పేరున్న స్కూలయినా...ఎన్ని డబ్బులు పోసినా పిల్లలు అక్కడ ఎలా ఉంటారో అని చాలా బెంగగానే ఉంటోంది...మొన్న మా పెద్దబాబు కి ఫోన్ చేస్తే వాడు చెప్పినది వింటే అప్పటికప్పుడు చదువు వద్దు...పాడు వద్దు తీసుకు వచ్చేద్దామని పించింది. వాడిని ఈ ఇయర్ గుడివాడ కే కే ఆర్ గౌతమ్ స్కూల్ లో సెవెంత్ లో జాయిన్ చేసాములెండి. ఏదో బాగా చెప్పేస్తారు...మరి ఈ పోటి ప్రపంచంలో వాడు కాస్త నెట్టుకు రావాలి కదా అని....హాస్టల్ అంత నీట్ గా ఏమి లేదు. వర్షం వస్తే చాలు మిడతలు పురుగులు పిల్లలకన్నా మూడువంతులు ఎక్కువగా రూముల్లొ వుంటాయి. ఎంత చల్లగా వున్నా చన్నీళ్ళే....వర్షాకాలంలో. బట్టలు ఐరన్ చేయిస్తాము అంటారు కాని అదీ లేదు...పాకెట్ మని అని కట్టించుకుంటారు కాని దానికి లెక్కలు భలే చెప్తారు....ఇన్ని వున్నా ఏదో పోనిలే చదువు బావుంటుందని అందరూ అంటున్నారు కదా!! వీడు కుడా కాస్త బయట ఎలా ఉండాలో అలవాటు పడతాడు అని అనుకున్నాము....మొన్న క్లాసులో సార్ ని బాత్రూం కి వెళ్ళాలి అని వీడు ఇంకో బాబు అడిగారంట. వెంటనే ఆ సార్ వీడిని గుండెల మీద చెయ్యి వేసి తోసేసాడంట..వీడేమో పడిపోయాడంట... వెంటనే.... వీడికి ఊపిరి కుడా ఆడలేదంట ఒక పది నిమిషాలు. మోకాలికి దెబ్బ కుడా తగిలిందంట అయినా కుడా ఆ మహానుభావుడు పట్టించుకోలేదంట . మనము గొప్ప స్కూలు బాగా చదువు చెప్తారు డబ్బులు బోలెడు కడుతున్నాము కదా...బాగా చూసుకుంటారు అనుకుంటాము కాని వాళ్ళేమో డబ్బులు మాత్రమే తీసుకుంటారు కాని పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదు...కనీసం మంచి టీచర్స్ ని కుడా పెట్టకుండా ట్రయినీలను పెడుతున్నారు....మా వాడు బాగానే చదువుతాడు ఇంతకు ముందు ఎప్పుడూ స్కూలులొ దెబ్బలు కుడా తినలేదు అందులో వాడికి మాట అంటే చాలా కోపం... బాగా సెన్సిటివ్. పడిపోగానే కాస్త తెలియగానే బాగా ఏడ్చేసాడంట....మరీ బాగా నిర్లక్ష్యంగా వుంటున్నారు యాజమాన్యం, ఉపాధ్యాయులు కుడా.....ఏమి కాలేదు కాబట్టి సరి పోయింది కాని ఆ పది నిమిషాలలో ఏమైనా జరిగినా కుడా అంతే కదా!! ఈ విష్యం కుడా మేము ఆ రోజు రాత్రి ఫోన్ చేస్తే ఎప్పటికో చెప్పాడు.....పిల్లలు చాలామంది స్కూలులో విషయాలు ఇంట్లో చెప్పరు....వీడు కుడా అస్సలు ఏమి చెప్పడు....చిన్న చిన్న గొడవలు అందరికి ఉండేవే కాని ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ఈ కార్పోరేట్ స్కూళ్ళు.....మనమేమో బాగా చెప్తారు బాగా కేర్ తీసుకుంటారు హాస్టల్ లో ఉంచితే అని బోల్డు బోల్డు డబ్బులు పోసి పెడుతున్నాము కాని ఈ కార్పోరేట్ స్కూళ్ళ పరిస్థితి ఇదండీ....మీ పిల్లలు కుడా ఇలాంటి స్కూళ్ళలో వుంటే కాస్త కాదు...కాదు...బాగానే జాగ్రత్త అండి....

11 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

మంజు గారు ,
మావాడు అదే స్కూల్ లో రెండేళ్ళు వున్నాడండి .ఇప్పుడూ అదే స్కూల్ కానీ బ్రేంచ్ వేరు . హాస్టల్ విష్యంలో మీరు చెప్పినవన్నీ నిజమే.
పిల్లల్ని కొట్టకూడదని చట్టాలు చేసినా , అది ఎక్కడా అమలవటంలేదు . మా పాప చైతన్య టెక్నో స్కూల్ . అయిరన్ స్కేల్ తో కొడుతున్నారట పిల్లల్ని. ఆడపిల్లలని కొట్టరుకానీ మగపిల్లల్ని చెంపమీద కొట్టడం వంటివి చేస్తారట. క్లాసులో టీచర్లు పిల్లల్ని అవమానిస్తూ మాట్లాడటం సర్వసాధారణం అయిపోయింది.
చాలా విషయాలు పిల్లలు ఇంట్లో చెప్పరు. ఎందుకంటే మనం కంప్లైంట్ చేస్తే ఆ కోపం తిరిగి వాళ్ళమీద చూపిస్తారేమో అని పిల్లలు భయపడతారు .
అసలు ఆ గుడివాడ స్కూల్ లో వాచ్ మెన్ తప్ప టీచర్ గానీ, ప్రిన్సిపల్ గానీ , వార్డెన్ గానీ ...అసలెవ్వరూ పేరెంట్స్ కి దొరకరు . ఏదైనా అడగటానికి సమాధానం చెప్పేవాళ్ళేవుండరు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు.. మీరు చెపుతున్నవి..చాలా సాదారణంగా కనబడతాయి..టీచర్స్ కి . వారికి మార్క్స్ తప్ప ఇంకేమి పట్టవు.మా చెల్లి కూతురు అక్కడే (గూడవల్లి) నాలుగు సంవత్సరాల నుండి ఒకే బ్రాంచ్.మీరు వెళ్ళి మాట్లాడండి.కానీ జాగ్రత్రండి.పిల్లలని వేదిస్తారు తరువాత.

లత చెప్పారు...

మరీ సెవెంత్ లోనే హాస్టల్ ఎందుకండీ
నేనింకా యే టెంతో అనుకున్నాను మీరు హాస్టల్ లో వేశాను అంటే
ముందు ఇవన్నీ ఎంక్వైరీ చెయ్యలేదా,ఇప్పుడు ఇబ్బంది కదా పాపం

కృష్ణప్రియ చెప్పారు...

:-(( అయ్యో.. హాస్టల్ లో ఏడో తరగతి లోనే వేశారన్నారు. మీకు దగ్గరలో మంచి స్కూల్స్ లేవా?

Tejaswi చెప్పారు...

మనం పిల్లలను అపురూపంగా చూసుకుంటుంటే ఈ స్కూల్స్ లో మాత్రం ఏదో మందలను మల్లేసినట్లు చేస్తున్నారు. మీ బాధ అర్ధమవుతోంది.

@కనీసం మంచి టీచర్స్ ని కూడా పెట్టకుండా ట్రయినీలను పెడుతున్నారు

టీచర్ ల విషయంలో బాగా మ్యాన్ పవర్ కొరత ఉందండి. మేనేజ్ మెంట్ కు ఫ్యాకల్టీ మీద మీకున్న అసంతృప్తిపై ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఉండండి.

శరత్ కాలమ్ చెప్పారు...

మా బందువులు తమ అబ్బాయిని మొదటి తరగతిలో, రెండవతరగతిలోనో హాస్టల్లో వేసారు - బాహ్గా చదివి ఉద్ధరించాలని. కొన్ని నెలల తరువాతో లేక ఆ ఏడాది అయిపోయాకో ఇంటికి తీసువచ్చారు లెండి.

అజ్ఞాత చెప్పారు...

అంత చిన్న పిల్లాడిని హాస్టల్ లో ఎలా చేరిపించారు. బాగా డబ్బుండి చదువురాని తల్లితండ్రులు హాస్టల్ లో చేరిపించారంటే అర్థం వుంది. ఏదో టెన్త్ క్లాస్స్ కి అంటే అదోరకం. కన్న తల్లితండ్రుల కన్నా ఎవరూ పిల్లల గురించి శ్రద్ధ తీసుకోరు. వాళ్ళ చదువులగురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ. పిల్ల గురించి శ్రద్ధ తీసుకోగలిగిన వాళ్ళే వాళ్ళను కనాలి.మన గురించి మన కుటుంబం గురించి కూడా తీరుబాటు లేని పనులు వుండకూడకు. మనం బ్రతికేది జీవించాలి కాబట్టి. ఈ కాస్త జీవితం లోనూ మన అనుకునే వాళ్ళని ఒక్క క్షణం కూడా మిస్ అవ్వకూడదు. ఏమీ అనుకోకండి. మీ అబ్బాయికి ఇప్పటికే బుద్ధి వచ్చి వుండాలి . మీ దగ్గరకు తెచ్చేసుకోండి. ఆ హాస్టల్ కి కట్టే డబ్బుతో ఎవరైనా బీద , చదువుకున్న వాళ్లకు జీతం ఇచ్చి, ఇంటి దగ్గర ట్యూషను పెట్టించండి. మీ కళ్ళఎదురుగా ఉంటాడు, పేరెంట్స్ భయం వుంటుంది ఇంకో మనిషికి సహాయం చేసినట్టూ వుంటుంది. కానీ మంచి ట్యూటరుని ఎన్నుకోండి. ఎలా చెబుతున్నారో, వాళ్లకి తెలియకుండా ఒక కన్ను వేసి వుంచండి.ప్రతి రోజూ అతని పుస్తకాలని చెక్ చేయండి. ప్రతీ వారం వెళ్లి టీచర్స్ ని కలవండి. మీరూ అతనితో బాటు చదువుతున్నంత సేపూ కూర్చోండి కొంతకాలం వరకూ. తర్వాత తనే చదువుకుంటాడు.
స్కూల్ నుంచి వచ్చి అమ్మ పెట్టినది తిని హాయిగా చదువుకుని నిశ్చింతగా పడుకుంటాడు. తనకు సమయం కూడా కలిసి వస్తుంది. ఒక్కడికీ శ్రద్ధగా చెబుతారు కాబట్టి బాగా చదువుతాడు. అంటే కాదు .మీకు మానసికంగా దూరం కాకుండా ఉంటాడు. ప్లీజ్ కొంచం అలోచించి మీ అబ్బాయిని వెంటనే ఇంటికి తెచ్చేసుకోండి.
పిల్లలను హాస్టల్ లో చేరిపించిన తల్లి తండ్రులందరికీ ఇది నా వినతి.

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు అన్నది కుడా నిజమేనండి అనిత... అందుకే చాలా సేపు అడగవద్దులే అనుకున్నాము కాని మళ్ళి ఏమౌతుందో అని.....సారి చెప్పారు చూసుకోలేదు అనుకోకుండా జరిగింది అని చెప్పారు.మా బాబు గిదివాడ లో అండి థాంక్యు అనిత గారు, లలిత గారు

చెప్పాలంటే...... చెప్పారు...

చెప్పాను కదండీ మంచి స్కూలు అని ఏమి వుంటాయి అన్ని ఒకటే కదా!! ఈ పోటి ప్రపంచంలో వాళ్ళు ముందుకు పోవాలనే వేసింది....కృష్ణప్రియ గారు

చెప్పాలంటే...... చెప్పారు...

లత గారు వాడు సెవెంత్ అండి ఇంతకు ముందు స్కూలు లో బానే చదివేవాడు కాని ఇక్కడ బానే వస్తున్నాయిగా చాలు అనుకుంటాడు ఇప్పుడు మనం చెప్పినా అర్ధం చేసుకునే స్థాయి కాదు బయట కుడా అలవాటు పడతాడని చేర్చాము....తరచుగా వెళ్లి వస్తూనే వున్నాము.. ఇప్పుడు బానే వున్నాడులెండి
థాంక్ యు లతా, తేజశ్విని, శరత్ గారు

చెప్పాలంటే...... చెప్పారు...

తొలకరి గారు థాంక్యు అండి మీ సలహాకి.... డబ్బు వున్న తలిదండ్రులే కాదు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కుడా ఈ రోజులలో పిల్లల చదువులో బాగా శ్రద్ధగా వుంటున్నారు ఇలాంటివి జరుగుతూనే వుంటాయి...పిల్లలు కొందరు బాగా సెన్సిటివ్ గా వుంటారు బయట బ్రతకడం నేర్చుకుంటారు, ఈ పోటి ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే కొన్ని కొన్ని అలవాటు పడాలి చిన్న ఏజ్ కాదు లెండి టిన్ లోకి వచేస్తున్నారు అందుకే కాస్త తెలుస్తుందని పెట్టాము బాలేక పొతే మేమే వుండి చదివిన్చుకుంటాము.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner