3, మే 2012, గురువారం

మూగబోయిన జాబిలమ్మ.....!!


ఊసులాడే జాబిలమ్మ మూగబోయింది ఎందుకోమరి....
ఊసులదిగేవారు లేకో...ఏమో.
 ఊహలకందకో ఏమో..
రేయి గడిచినా...పగలు గడిచినా...ఆగని కాలం
ఆనందవిషాదాలను సమంగా మోస్తూనే వుంటుంది
మరపు మత్తులో మాయలో ముంచుతూనే వుంటుంది
జలతారు మబ్బుల పరదాలను దాటి
వెండి వెన్నెల వెలుగులను అందించి
శూన్యమైన నిశీధి నీడలలో...
కమ్మని ఊసులు కనులకు కట్టినట్లుగా
వినసొంపుగా వినిపించవమ్మా....
ఊసులాడే ఓ జాబిలమ్మా..!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

జలతారు వెన్నెల చెప్పారు...

So sweet! chaalaa baagundi manju gaaru.

హను చెప్పారు...

chala baga rastumdi meeru... nenu kaadu.... soo nice

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు సో మచ్ హను గారు వెన్నెల....

నా చిన్ననాటి స్నేహితుడు వాసు ఉసులాడే జాబిలమ్మా మాటలు లేవేంటి...? అని పలకరించేవాడు కొన్ని రోజులు మాట్లాడక పొతే....తను చనిపోయాడు ఎందుకో ఆ మాటలు గుర్తు వచ్చి అలా రాసాను....నచ్చినందుకు చాలా సంతోషం....

Kalyan చెప్పారు...

@మంజు గారు మీ జ్ఞాపకం చాలా బాగుంది ... నన్ను కూడా వాసు అని పిలుస్తారండి... బ్లాగులు పట్టుకొని మీ బ్లాగుకు వచ్చాను అందుకేనేమో ... మొత్తానికి ఆ తియ్యటి జ్ఞాపకం వచ్చే జన్మలోనైనా కలకాలం మీ తోడుండాలని కోరుకుంటున్నాను...

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు కళ్యాణ్ గారు జ్ఞాపకాలు ఎప్పుడూ

tIyagaane vuntaayi... chedu jnapakaalanu kudaa gurtu vunchukuntaamu kadaa!!

mana anukunna vaallu evaru daggaragaa leka poyinaa baadhagaane vuntundi....jivitam kadandi....ante mari....-:)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner